Parenting Tips: పిల్లలకు హెయిర్ ఆయిల్ బయట కొంటున్నారా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!

చిన్న పిల్లలకు చర్మం అయినా, జుట్టు అయినా చాలా సెన్సెటీవ్ గా ఉంటుంది. పిల్లలకు వాడే లోషన్స్, షాంపూలు, హెయిర్ ఆయిల్ ఇలా ప్రతి దానిని చాలా జాగ్రత్తగా వాడాలి. లేదంటే వారికి అలర్జీలు, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల పట్ల చాలా కేరింగ్ గా ఉంటారు తల్లలు. ప్రతీదీ సెలక్ట్ చేసుకుని మరీ ఉపయోగిస్తారు. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో బేబీ కేర్ ప్రాడెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో బేబీ హెయిర్ ఆయిల్స్ లో చాలా రకాలు ఉన్నాయి. అయితే వాటిల్లో తప్పనిసరిగా కొంచెమైనా..

Parenting Tips: పిల్లలకు హెయిర్ ఆయిల్ బయట కొంటున్నారా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!
Baby Natural Oil
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 23, 2023 | 3:00 PM

చిన్న పిల్లలకు చర్మం అయినా, జుట్టు అయినా చాలా సెన్సెటీవ్ గా ఉంటుంది. పిల్లలకు వాడే లోషన్స్, షాంపూలు, హెయిర్ ఆయిల్ ఇలా ప్రతి దానిని చాలా జాగ్రత్తగా వాడాలి. లేదంటే వారికి అలర్జీలు, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల పట్ల చాలా కేరింగ్ గా ఉంటారు తల్లలు. ప్రతీదీ సెలక్ట్ చేసుకుని మరీ ఉపయోగిస్తారు. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో బేబీ కేర్ ప్రాడెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో బేబీ హెయిర్ ఆయిల్స్ లో చాలా రకాలు ఉన్నాయి. అయితే వాటిల్లో తప్పనిసరిగా కొంచెమైనా కెమికల్స్ కలిసే ఉంటాయి. కెమికల్స్ కలపని ప్రాడెక్ట్స్ ఏమీ ఉండవు. పిల్లలకు రాసే ఆయిల్ విషయంలో ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఆయిల్ ని తలకు, చర్మానికి రాస్తారు. కాబట్టి బేబీస్ హెయిర్ ఆయిల్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఆ ఆయిల్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

తయారీ విధానం:

ఇంట్లోనే బేబీ నేచురల్ ఆయిల్ తయారు చేయడానికి స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకోవాలి. దీనికి కొద్ది మోతాదులో ఆముదం కలుపు కోవాలి. నెక్ట్స్ మరి కొంత మోతాదులో ఆలీవ్ ఆయిల్ కూడా తీసుకుని అందులో కలపండి. మీకు కావాలనుకుంటే లావెండెర్ ఆయిల్ కూడా రెండు చుక్కలు తీసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన ఆయిల్ ని పిల్లల హెయిర్ కి, బేబీ స్కిన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ తో మసాజ్ కూడా చేయవచ్చు. మనం తీసుకున్న ఆయిల్స్ అన్నీ నేచురల్ వి కాబట్టి.. వీటితో అలర్జీ, దురదలు, దద్దర్లు వంటి సమస్యలు తలెత్తవు.

ఇవి కూడా చదవండి

ఇలా స్టోర్ చేయండి:

ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ని ఓ గాజు సీసా వేసి స్టోర్ చేసుకోవాలి. ఈ గాజు సీసాను ముందుగానే శుభ్ర పరిచి.. ఎండలో పెడితే.. బ్యాక్టీరియా, తేమ పోతుంది. అలాగే దీనిపై ఎప్పుడూ మూత పెట్టి ఉంచాలి. రాసుకోవాలనుకున్నప్పుడు కొద్ది మొత్తంలో వేరే డబ్బాలోకి తీసుకోవాలి.

తక్కువ మోతాదులో రాయాలి:

కుదిరితే కొబ్బరి నూనె ను కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ ఆయిల్ ని కొద్దిగా మాత్రమే రాసుకోవాలి. అలాగే డబుల్ బాయిల్డ్ పద్దతిలో నూనెను వేడి చేసుకుని, మసాజ్ చేస్తే చాలా మంచిది. ఈ ఆయిల్ ని చక్కగా మనం పిల్లలకు ఉపయోగించవచ్చు. అయితే ఎక్కువగా కాకుండా.. తక్కువ మొత్తంలో తీసుకోవాలి. మసాజ్ చేసేటప్పుడు కూడా మెల్లగా మాసాజ్ చేయాలి. అయితే ఈ ఆయిల్ ని ఎక్కువ పరిమాణంలో కాకుండా.. తక్కువ పరిమాణంలో చేసుకోవాలి. ఈ ఆయిల్ దాదాపు మూడు నుంచి ఐదు నెలల పాటు నిల్వ ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.