Red Capsicum Benefits: రెడ్ క్యాప్సికంతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు!

మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో క్యాప్సికం కూడా ఒకటి. క్యాప్సికం.. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు వంటి రంగుల్లో లభిస్తుంది. వీటిల్లో ఎన్ని రంగులు ఉన్నా.. అందరూ ఎక్కువగా ఆకు పచ్చ క్యాప్సికమే ఉపయోగిస్తారు. ఆకు పచ్చ క్యాప్సికం తప్పించి.. మిగతా వాటిని ఎక్కువగా సలాడ్స్ లోనే యూజ్ చేస్తారు. వాటితో కూరలు చేయడం చాలా తక్కువ. అలాగే ఎరుపు, పసుపు రంగు క్యాప్సికం ఎక్కువగా స్టాటర్స్ లో వాడతారు. ఈ బెల్ పెప్పర్ తో చేసే వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. కేవలం ఆకు పచ్చనే కాకుండా..

Red Capsicum Benefits: రెడ్ క్యాప్సికంతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు!
Red Capsicum Benefits
Follow us
Chinni Enni

|

Updated on: Oct 20, 2023 | 9:18 PM

మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో క్యాప్సికం కూడా ఒకటి. క్యాప్సికం.. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు వంటి రంగుల్లో లభిస్తుంది. వీటిల్లో ఎన్ని రంగులు ఉన్నా.. అందరూ ఎక్కువగా ఆకు పచ్చ క్యాప్సికమే ఉపయోగిస్తారు. ఆకు పచ్చ క్యాప్సికం తప్పించి.. మిగతా వాటిని ఎక్కువగా సలాడ్స్ లోనే యూజ్ చేస్తారు. వాటితో కూరలు చేయడం చాలా తక్కువ. అలాగే ఎరుపు, పసుపు రంగు క్యాప్సికం ఎక్కువగా స్టాటర్స్ లో వాడతారు. ఈ బెల్ పెప్పర్ తో చేసే వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. కేవలం ఆకు పచ్చనే కాకుండా.. పసుపు, ఎరుపు రంగులను కూడా వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రెడ్ క్యాప్సికంలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్ ఏతో పాటు బీటా కెరోటీన్ వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. మరి ఇంకా ఎరుపు రంగు క్యాప్సికంలో ఎలాంటి పోషకాలు, ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ క్రియ రేటును పెంచుతుంది:

జీర్ణ క్రియ రేటును పెంచే వాటిల్లో రెడ్ కలర్ క్యాప్సికం కూడా ఒకటి. దీంతో తిన్న ఆహారాన్ని తిన్నట్టు జీర్ణం చేస్తుంది. గ్యాస్, మలబద్ధకం, జీర్ణ సమస్యలు తలెత్తవు. దీంతో బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది:

రెడ్ కలర్ క్యాప్సికం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే రక్త పోటును కంట్రోల్ చేస్తుంది. అంతే కాకుండా అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో గుండెకు వెళ్లే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.

కంటి చూపును మెరుగు పరుస్తుంది:

ఈ కలర్ క్యాప్సికంలో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరచడంలో ఎంతో హెల్ప్ అవుతుంది. కంటికి సంబంధించిన ఇతర సమస్యలను కూడా రాకుండా చేస్తుంది.

డైట్ లో ఉన్నవాళ్లు బెస్ట్:

బరువు తగ్గడంలో రెడ్ కలర్ క్యాప్సికం చక్కగా పని చేస్తుంది. డైట్ లో ఉన్న వారు ఈ కలర్ క్యాప్సికంను వాడటం వల్ల వెయిట్ లాస్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

రెడ్ కలర్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. అలాగే ఎరుపు రంగు క్యాప్సికం వాడటం వల్ల ఎనర్జీ లెవల్స్ అనేవి బాగా పెరుగుతాయి. కాబట్టి వీటిని కూడా ఆహారంలో చేర్చుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.