Skin Care: ఫేస్ కి నెయ్యిని ఇలా రాయండి.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తాయి!
నెయ్యి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నెయ్యితో జరిగే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. పూర్వం అయితే నెయ్యి లేని భోజనం ఉండేది కాదు. ఆయుర్వేదంలో కూడా నెయ్యిని వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో ఉపయోగించేవారు. నెయ్యిని ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక శరీరం బలంగా, దృఢంగా తయారవుతుంది. ఇలా నెయ్యిని ఆరోగ్య పరంగా, బ్యూటీ కేర్ పరంగా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చర్మ సమస్యలకు చెక్ పెట్టడంలో, మెరుగు..
నెయ్యి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నెయ్యితో జరిగే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. పూర్వం అయితే నెయ్యి లేని భోజనం ఉండేది కాదు. ఆయుర్వేదంలో కూడా నెయ్యిని వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో ఉపయోగించేవారు. నెయ్యిని ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక శరీరం బలంగా, దృఢంగా తయారవుతుంది. ఇలా నెయ్యిని ఆరోగ్య పరంగా, బ్యూటీ కేర్ పరంగా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చర్మ సమస్యలకు చెక్ పెట్టడంలో, మెరుగు పరచడంలో నెయ్యి బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా చర్మ రక్షణలో నెయ్యి ఎలా ఉపయోగ పడుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పొడి చర్మం ఉన్నవాళ్లు ఇలా చేయండి:
చాలా మందికి చర్మం పొడిబారి పోయినట్టు ఉంటుంది. ఇలాంటి వారికి నెయ్యి బాగా హెల్ప్ అవుతుంది. ప్రతి రోజు స్నానం చేసే ముందు కొద్దిగా నెయ్యిని వేడి చేసుకుని.. ముఖం, శరీరంపై రాయండి. ఓ 15 నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా చేస్తూ ఉంటే డ్రై స్కిన్ పోయి.. చర్మం మృదువుగా మారుతుంది.
గ్లో స్కిన్:
కొంత మంది డల్ స్కిన్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మంపై దుమ్మూ, ధూళి చేరడం వల్ల చర్మంపై మృత కణాలు అనేవి పేరుకు పోతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అవి చర్మంపై చేరి.. ముఖాన్ని నిర్జీవంగా మారుస్తుంది. డల్ స్కిన్ ని గ్లో స్కిన్ గా మార్చాలంటే.. పాలు, సముద్రపు పిండిలో కొద్దిగా నెయ్యి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
నల్ల మచ్చలను పోగొడుతుంది:
చాలా మందికి కళ్ల కింద నల్లటి వలయాలు అనేవి కామన్ గా ఉంటాయి. దీనికి ముఖ్య కారణం నిద్ర, ఎక్కువగా స్క్రీనింగ్ చూడటం. ఇవి వచ్చాయంటే అంత తొందరగా పోవు. ఇలా కళ్ల కింద మచ్చలు పోవాలంటే.. కను రెప్పల మీద, కింద నెయ్యి రాయాలి. ఆ తర్వాత ఉదయం లేవగానే శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే.. మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.
డార్క్ పెదాలకు:
చాలా మందికి పెద్దాలు అనేవి నల్లగా అయిపోతాయి. కొన్ని సార్లు పిగ్మంటేషన్ వల్ల కూడా ఇలా అయిపోతాయి. ఇలా నల్లగా ఉన్న పెదాలు.. మళ్లీ నార్మల్ కలర్ లోకి రాలంటే నెయ్యి బాగా పని చేస్తుంది. ఒక చుక్క నెయ్యిని పెదాలపై రాసి రాత్రంతా అలాగే వదిలేయండి. మరుసటి ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని డేస్ చేస్తే.. ఫలితాన్ని మీరే గమనించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.