- Telugu News Photo Gallery Eye Care: Take these vitamins for healthy eyesight, Check here is details in Telugu
Eye Care Tips: కంటి చూపు బాగుండాలంటే ఈ విటమిన్లు ఎంతో అవసరం!
మన శరీరంలో అతి సున్నితమైన భాగాల్లో కళ్లు కూడా ఒకటి. అవి చక్కగా ఉంటేనే కంటి చూపు అనేది చక్కగా పని చేస్తుంది. 'సర్వేంద్రియానం ప్రదానం' అని పెద్దలు ఊరికే అనలేదు. అంత శక్తి కళ్లకు ఉంది. కళ్లు చక్కగా పని చేస్తేనే.. ఏ పని అయినా చేయడానికి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కళ్లకు సంబంధించి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కంటి చూపు తగ్గ డంలో కళ్లు మండటం, పొడి బారడం, నీరు కారడం, రే చీకటి, కంటి పొరలు..
Updated on: Oct 20, 2023 | 1:05 PM

మన శరీరంలో అతి సున్నితమైన భాగాల్లో కళ్లు కూడా ఒకటి. అవి చక్కగా ఉంటేనే కంటి చూపు అనేది చక్కగా పని చేస్తుంది. 'సర్వేంద్రియానం ప్రదానం' అని పెద్దలు ఊరికే అనలేదు. అంత శక్తి కళ్లకు ఉంది. కళ్లు చక్కగా పని చేస్తేనే.. ఏ పని అయినా చేయడానికి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కళ్లకు సంబంధించి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కంటి చూపు తగ్గ డంలో కళ్లు మండటం, పొడి బారడం, నీరు కారడం, రే చీకటి, కంటి పొరలు దెబ్బ తినడం ఇలా రక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా కంటి సమస్యలు తగ్గాలన్నా.. ఎదురవుకుండా ఉండాలన్నా మంచి హెల్దీ ఆహారం తీసుకోవాలి. మీరు తిసుకునే ఆహారంలో ఈ విటమిన్లు కూడా ఉండేలా చూసుకోండి. పలు రకాల విటమిన్ల వలన కళ్ల సమస్యలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి.

విటమిన్ ఏ కంటి ఆరోగ్యం మెరుగు పరచడంలో ఎంతో సహాయ పడుతుంది. ఈ విటమిన్ ఎక్కువగా గడ్లు, పాలు, చేపలు, చీజ్, పెరుగు, క్యారెట్, ఆకు కూరలు, కాలేయం వంటి ఆహారల్లో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే పై ఆహారాలు ఉండేలా చూసుకోండి.

విటమిన్ సి: నిమ్మ జాతికి చెందిన పండ్లలో విటమిన్ సి అనేది మెండుగా ఉంటుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యంలో కంటి సమస్యలు ఎదురవకుండా చేస్తాయి. ఇంకా బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్రోకలీ వంటి ఆహారాల్లో కూడా విటమిన్ సి లభిస్తుంది.

విటమిన్ ఇ: ఈ విటమిన్ తీసుకోవడం వలన కంటి పొరలు, మ్యాక్యులర్ డిజెనరేషన్ వంటి కంటి సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తుంది. బాదం పప్పు, చియా విత్తనాలు, పొద్దు తిరుగుడు గింజల్లో ఎక్కువగా ఈ విటమిన్ లభ్యమవుతుంది. ఇంకా విటమిన్ కే, విటమిన్ 12 ఉన్న ఆహారలు కూడా ఎక్కువగా తీసుకుంటే కంటి సమస్యలు ఎదురవకుండా ఉంటాయి.





























