AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dieting Side Effects: డైటింగ్ చేస్తున్నప్పుడు.. ఈ సమస్య వేధిస్తుందా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో అందర్నీ వేధించే సమస్య.. అధిక బరువు. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో బరువు తగ్గేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూంటారు. వ్యాయాయం, డైటింగ్ అంటూ బరువు తగ్గేందుకు ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయో.. వాటన్నింటినీ ఉపయోగిస్తారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెడతారు. అయితే ఇలా..

Dieting Side Effects: డైటింగ్ చేస్తున్నప్పుడు.. ఈ సమస్య వేధిస్తుందా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!
Dieting Food
Chinni Enni
|

Updated on: Oct 20, 2023 | 6:13 PM

Share

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో అందర్నీ వేధించే సమస్య.. అధిక బరువు. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో బరువు తగ్గేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూంటారు. వ్యాయాయం, డైటింగ్ అంటూ బరువు తగ్గేందుకు ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయో.. వాటన్నింటినీ ఉపయోగిస్తారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెడతారు. అయితే ఇలా స్ట్రిక్ట్ డైట్ మెయిన్ టైన్ చేయడం వల్ల కొన్ని మంచి ఫలితాలు ఉంటే.. మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ లో ఒకటి.. జుట్టు రాలి పోవడం ఒకటి. డైటింగ్ మెయిన్ టైన్ చేసే సమయంలో ఎక్కువగా జుట్టు రాలి పోతూ ఉంటుంది. బరువు తగ్గుతున్నాం అనుకుంటూనే.. మరో వైపు జుట్టు రాలిపోతుందనే బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది.

డైటింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి:

బరువు పెరిగినంత ఫాస్ట్ గా.. మనం బరువు తగ్గలేం. అదే విధంగా అంత తొందరగా బరువు తగ్గడం కూడా హెల్త్ కి మంచిది కాదు. దీని వల్ల ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. మీరు తీసుకునే ఆహారంలోనే జుట్టు సంబంధిత సమస్యలు కూడా ఆధార పడి ఉంటాయి. కాబట్టి డైటింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టును రాలకుండా ఉండేందుకు ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

మీరు తీసుకునే డైట్ లో అన్ని రకాల పోషకాలు ఉండాలి:

బరువు తగ్గడంలో ముఖ్యంగా తీసుకునే ఆహారంలో.. కేలరీలు తక్కువగా, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటాం. వీటి వల్ల ఇతర శరీర భాగాలకు, జుట్టుకు అందాల్సిన పోషకాలు సరిగ్గా అందవు. దీంతో హెయిర్ బలహీనంగా మారి.. రాలిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే డైట్ లో ఇతర ఆహార పదార్థాలు కూడా యాడ్ చేయాలి. మీరు ఎలాంటి డైట్ ప్రారంభించాలని అనుకున్నా.. ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వారి సూచలన ప్రకారం.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలి.

వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి:

దీని వల్ల బాడీ అన్ని రకాల కేలరీలను తప్పకుండా గ్రహిస్తుంది. కాబట్టి హ్యాపీగా బరువు తగ్గుతూనే.. ఆనందంగా కూడా ఉండవచ్చు. శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు, కేలరీలు ఇస్తూనే.. నిర్దిష్టంగా తీసుకోవాలి. మీ లైఫ్ స్టైల్ లో అనేక మార్పులు చేసుకుంటూ ఉంటూ.. బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. ఉదయం వాకింగ్, జాగింగ్, పలు రకాల వ్యాయామాలు చేయడం వల్ల శరీరం బలంగా, దృఢంగా మారుతుంది. అదే విధంగా తలపై రక్త ప్రసరణ అందించే వ్యాయామాలు, మసాజ్ లు చేసుకుంటూ హెయిర్ ను కూడా కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.