Alcohol Drinking: మద్యం సేవించేటప్పుడు కారంగా, ఉప్పగా ఉండే ఆహారాలు తింటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..

చాలా మందికి లేట్ నైట్‌ ఆల్కహాల్‌ సేవించే అలవాటు ఉంటుంది. కొంత మంది స్నేహితులతో కలిసి రెస్టారెంట్స్‌కి రకరాల వంటకాలతో విస్కీ, బీర్ తాగేందుకు ఇష్టపడతారు. కానీ ఆల్కహాల్‌తో సేవించేటప్పుడు కొన్ని రకాల ఆహారాలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పు కాంబినేషన్‌లో ఆహారం తింటే ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుందని అంటున్నారు. ఆల్కహాల్‌ సేవించేటప్పుడు ఎలాంటి డ్రింక్‌, ఆహారాలు నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Alcohol Drinking: మద్యం సేవించేటప్పుడు కారంగా, ఉప్పగా ఉండే ఆహారాలు తింటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
Alcohol Drinking
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 23, 2023 | 2:09 PM

చాలా మందికి లేట్ నైట్‌ ఆల్కహాల్‌ సేవించే అలవాటు ఉంటుంది. కొంత మంది స్నేహితులతో కలిసి రెస్టారెంట్స్‌కి రకరాల వంటకాలతో విస్కీ, బీర్ తాగేందుకు ఇష్టపడతారు. కానీ ఆల్కహాల్‌తో సేవించేటప్పుడు కొన్ని రకాల ఆహారాలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పు కాంబినేషన్‌లో ఆహారం తింటే ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుందని అంటున్నారు. ఆల్కహాల్‌ సేవించేటప్పుడు ఎలాంటి డ్రింక్‌, ఆహారాలు నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఉప్పగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి యమ డేంజర్‌

ఫ్రెంచ్ ఫ్రైస్, సాల్టెడ్ నట్స్, చిప్స్ వంటి వాటిని ఆల్కహాల్‌ సేవించేటప్పుడు తింటుంటారు. అలాగే చాలామంది చికెన్ పకోరా, ఫిష్ ఫ్రై వంటి వేయించిన ఆహారాన్ని తింటుంటారు. కానీ ఈ ఆహారాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్‌తో ఉప్పు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం మరింత దిగజారుతుంది. ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హాని అనే విషయం తెలిసిందే. ఇక ఇటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం త్వరగా నాశనం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

బ్రెడ్

బీర్‌ వంటి డ్రింక్స్‌ తాగేటప్పుడు బర్గర్‌లు లేదా పిజ్జా వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎలాంటి బ్రెడ్‌ తయారీలో అయినా ఈస్ట్ ఉపయోగిస్తుంటారు. బీర్ వంటి పానీయాలలో కూడా అధిక మొత్తంలో ఈస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల కాలేయంపై అధిక ప్రభావం పడుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్-గుండె మంట సమస్యలు రావచ్చు.

ఇవి కూడా చదవండి

స్పైసీ ఫుడ్

స్పైసీ మాంసం, బిర్యానీ, కబాబ్‌లతో ఇష్టమైన పానీయం సేవిస్తే ఆ మజానే వేరు. ఆల్కహాల్‌ తాగేటప్పుడు స్పైసీ ఫుడ్ తింటే జీర్ణక్రియకు ఆటంకాలు కలిగిస్తుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో మద్యం తాగడం, స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.

పాల ఉత్పత్తులు

కొందరు ఆల్కహాల్‌తో స్వీట్లను తింటుంటారు. ఆల్కహాల్‌ సేవించేటప్పుడు జున్ను, ఐస్ క్రీమ్ లేదా పెరుగు వంటి ఏదైనా పాల ఉత్పత్తిని తినడం అంత మంచింది కాదు. అలాగే చాక్లెట్‌ వంటి ఆహారాలను కూడా తినకూడదు. ఇది కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.