- Telugu News Photo Gallery Health Tips: Constantly feeling weak and tired? Do these remedies to boost stamina
Tiredness: చిన్న పనికే అలసిపోతున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే..
చిన్న పని చేసినా అలసిపోతున్నారా? అలసట, బలహీనత కారణంగా ఏ పని చేయలేకపోతున్నారా? అయితే మీకు స్టామినా తక్కువగా ఉందని అర్థం. స్టామినా తగ్గడం వల్ల పని చేసే సామర్థ్యం తగ్గుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది. స్టామినాను పెంచుకోవాలనుకుంటే మీ దినచర్యలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది..
Updated on: Oct 23, 2023 | 12:38 PM

చిన్న పని చేసినా అలసిపోతున్నారా? అలసట, బలహీనత కారణంగా ఏ పని చేయలేకపోతున్నారా? అయితే మీకు స్టామినా తక్కువగా ఉందని అర్థం. స్టామినా తగ్గడం వల్ల పని చేసే సామర్థ్యం తగ్గుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది. స్టామినాను పెంచుకోవాలనుకుంటే మీ దినచర్యలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది.

జీవనశైలిలో ఒత్తిడి కారణంగా చాలా మందికి నిద్ర సరిగా పట్టదు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పూర్తి నిద్ర లేకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు. గరిష్టంగా పని చేయాలనుకుంటే రాత్రిపూట కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. దీంతో అలసట తొలగిపోయి శరీరం చురుగ్గా ఉంటుంది.

శరీర శక్తిని పెంచడంలో సమతుల్య, పోషకమైన ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సీజనల్‌గా వచ్చే పండ్లు, కూరగాయలు తినడం మంచిది. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, పప్పులు, సోయాబీన్స్ వంటి పోషకాలను ఆహారంలో చేర్చుకుంటే శరీర పని సామర్థ్యం వేగంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

శరీరంలో నీటి కొరత కూడా మనల్ని బలహీనంగా, అలసిపోయేలా చేస్తుంది. ఇది మానసిక బలహీనత, బద్ధకాన్ని కలిగిస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 3-4 లీటర్ల నీళ్లు త్రాగాలి.

వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం చాలా దృఢంగా మారుతుంది. ఇది బరువును తగ్గిస్తుంది. పని సామర్థ్యాన్ని పెంచుతుంది. జిమ్‌కు వెళ్లలేకపోతే, ఇంట్లోనే వ్యాయామం చేయవచ్చు. జాగింగ్ కూడా మంచి మార్గం.





























