రక్తహీనత బారిన పడకుండా ఉండాలంటే వీటిని అస్సలు తినొద్దు.. వీటిని ఆహారంలో చేర్చుకోవాలి..
ఐరన్ మన శరీరానికి అత్యవసరమైన ముఖ్యమైన పదార్థం. ఇది రక్త ఉత్పత్తి, శ్వాసక్రియ , శరీరం సరైన పనితీరును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

ఐరన్ మన శరీరానికి అత్యవసరమైన ముఖ్యమైన పదార్థం. ఇది రక్త ఉత్పత్తి, శ్వాసక్రియ, శరీరం సరైన పనితీరును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఐరన్ లోపం రక్తహీనతతో సహా అనేక అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు.శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గినప్పుడు రక్తహీనత వస్తుంది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది రక్తహీనతతో సతమతం అవుతున్నారు. రక్తహీనత కారణంగా అలసట, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, శరీరం చల్లగా ఉండటం వంటి లక్షణాలకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 33 శాతం గర్భిణీ స్త్రీలు, 42% మంది పిల్లల్లో ఐరన్ లోపం ఉన్నట్లు కనుగొన్నారు. ఐరన్-డెఫిషియన్సీ ని అనీమియా అంటారు.
భారతదేశంలో ఇది 6 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు అనీమియాతో ప్రభావితం అవుతున్నారని ప్రముఖ పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు తమ రోజువారీ ఆహారంలో ఐరన్ తీసుకోవడం చాలా అవసరం. మీ ఆహారాన్ని ఐరన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా అనీమియాను పారద్రోలవచ్చు.
వీటిని ఆహారంలో చేర్చండి:
1. విటమిన్ సి:
సిట్రస్ పండ్లు, నిమ్మకాయలు, ఉసిరికాయలు, టొమాటోలు, జామకాయలు, కివి, పుచ్చకాయలు, ఆకుకూరలు, క్యాప్సికమ్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు. ఇవి ఐరన్ ను బాగా గ్రహించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో నిమ్మకాయ రసం ఒక టీస్పూన్ జోడించడం ద్వారా బోలెడు సి. విటమిన్ మీ సొంతం అవుతుంది. అలాగే ఉసిరి చట్నీ తినడం ద్వారా కూడా విటిమన్ సి పొందవచ్చు. .
2. విటమిన్ A:
విటమిన్ A శరీరంలో ఐరన్ ను విడుదల చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల శరీరంలో ఈ విటమిన్ తగినంత మొత్తంలో అనీమియాను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ A కావాలంటే క్యారెట్, చిలగడదుంపలు, బచ్చలికూర, ఎర్ర మిరియాలు, పాలు, కోడి గుడ్లు, నారింజ, చేపల్లో పుష్కలంగా ఉంటుంది.
వీటిని అధికంగా తీసుకోవద్దు:
1.కాల్షియం , ఫాస్పరస్:
కాల్షియం , ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ఇవి ఐరన్ శరీరంలో డిపాజిట్ కాకుండా నిరోధిస్తాయి. పోషకాహార నిపుణుల సూచన ప్రకారం ఆహారం తీసుకున్న వెంటనే పాలను తాగకూడదు. మీ భోజనం చేసే సమయానికి పాలు తాగడానికి కనీసం 3 గంటల గ్యాప్ ఉండాలి. అలాగే ఫాస్పరస్ అధికంగా ఉండే అరటి పళ్లను కూడా ఎడా పెడా తినేయొద్దు.
2.దుంపలను అధికంగా తీసుకోవద్దు;
రెగ్యులర్ గా బచ్చలికూర, చిలగడ దుంప, ఆలుగడ్డ లాంటి దుంపలను తీసుకోవద్దు. ఇవి ఐరన్ ను శరీరంలో డిపాజిట్ కాకుండా నిరోధిస్తాయి. ఫలితంగా అనీమియా వచ్చే అవకాశం ఉంటుంది.
3. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి;
ఐరన్-రిచ్ ఫుడ్స్‌తో కూడిన భోజనం తిన్న వెంటనే, టీ, కాఫీ లేదా పాలు తీసుకోవద్దు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..