Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infant Sleep: చంటి పిల్లలు నిద్రపోవడం లేదా..? అయితే ఈ ఆరు చిట్కాలు పాటిస్తే చాలు వెంటనే నిద్రపోతారు…!!

నవజాత శిశువుల నిద్ర అనేది చాలా పెద్ద సమస్య. వారు సరిగ్గా పడుకోకపోతే తల్లి ఆరోగ్యం సైతం దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఎందుకుంటే అర్థరాత్రి, అపరాత్రి లేవడం వల్ల తల్లికి కూడా సరైన నిద్ర ఉండదు.

Infant Sleep: చంటి పిల్లలు నిద్రపోవడం లేదా..? అయితే ఈ ఆరు చిట్కాలు పాటిస్తే చాలు వెంటనే నిద్రపోతారు...!!
Baby Sleeping
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 27, 2023 | 10:38 AM

నవజాత శిశువుల నిద్ర అనేది చాలా పెద్ద సమస్య. వారు సరిగ్గా పడుకోకపోతే తల్లి ఆరోగ్యం సైతం దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఎందుకుంటే అర్థరాత్రి, అపరాత్రి లేవడం వల్ల తల్లికి కూడా సరైన నిద్ర ఉండదు. ఫలితంగా తల్లి ఆరోగ్యం సైతం చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే నవజాత శిశువుల నిద్రను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని చిట్కాలను చెబుతున్నాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీ బిడ్డ కోసం 7 ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు మీరు అనుసరించాలి.

  1. శిశువుల మీల్స్ టైం మెయిన్ టెయిన్ చేయాలి: మీ శిశువుకు మంచి నిద్ర ఉండాలంటే మీరు వారి భోజనాన్ని సరిగ్గా ప్లాన్ చేయాలి. మీరు నిద్రవేళకు ముందు వారికి ఆహారం ఇవ్వాలి, అప్పుడు ఆకలి కారణంగా అడపాదడపా మేల్కొనరు.
  2. స్లీపింగ్ టైమింగ్‌ని షెడ్యూల్ చేయండి: మీ బిడ్డ కోసం అర్థరాత్రి మధ్యలో లేవకుండా వారి నిద్ర షెడ్యూల్‌ని ప్లాన్ చేయాలి. వారి కోసం నిద్ర మేల్కొనే సమయాలను నిర్ణయించండి. స్నానం చేయడం, ఆహారం ఇవ్వడం, నిద్ర సమయాన్ని టైంటేబుల్ ప్రకారం రూపొందించండి. మీరు టైంటేబుల్ ప్రకారం మీ బిడ్డను మంచం మీద పడుకోబెట్టాలి. నిద్రరావడం లేదని వారిని ఆడించకూడదు.
  3. పాసిఫైయర్ ఉపయోగించండి: మీ బిడ్డకు నిద్రపట్టడంలో ఇబ్బంది ఉంటే, పాపకు పాసిఫైయర్ నోట్లో పెట్టవచ్చు. పాసిఫయర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నిద్రలో ఒక్కోసారి శిశువులు శ్వాస ఆడక షాక్ గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి సిండ్రోమ్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
  4. బెడ్రూంలో ఈ మార్పులు చేయండి: చంటి పాపల నిద్రను ప్రోత్సహించడానికి, వారి బెడ్రూంను శుభ్రంగా ఉంచాలి. వెలుతురు ఎక్కువగా లేకుండా ఉండాలి. చిన్న బెడ్ లైట్ ఉంచుకోవాలి. అలాగే టీవీ, మొబైల్ బెడ్రూంలో ఉంచకూడదు. పిల్లలు నిద్రపోవడానికి జోల పాట పాడాలి. అప్పుడు వారు హాయిగా నిద్రిస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6. లాంగ్ డే నిద్ర మానుకోండి: నిద్రపోవడం మీ శిశువు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది, పగటి వేళ ఎక్కువసేపు నిద్రపోకుండా చూడండి, ఎందుకంటే ఇది వారి నిద్ర షెడ్యూల్‌కు భంగం కలిగిస్తుంది. పగటిపూట శిశువును వెలుగులోకి తీసుకురావాలి. సహజ సూర్యకాంతి మీ బిడ్డను చురుకుగా ఉంచుతుంది, చీకటి వారి పడుకునే సమయాన్నిపెంచుతుంది. చంటిపిల్లలను రాత్రి పూట మెలకువ ఉంచడం అంత మంచిది కాదు.
  7. మీ బిడ్డ అలసిపోయిందని ఇలా తెలుసుకోండి: పసిపిల్లలు పుట్టిన తొలి 3 నెలల్లో ఎక్కువగా నిద్రపోతారు. రోజులో రెండు, మూడు గంటల కంటే ఎక్కువ మేల్కొని ఉండరు. వయస్సు పెరిగే కొద్దీ వారి మేల్కొనే సమయం క్రమంగా పెరుగుతుంది. మీరు వారిని పడుకోబెట్టడానికి ఎక్కువ సమయం తీసుకుంటే, వారికి నిద్రపట్టడం కష్టంగా మారిందని గుర్తించాలి. మీ బిడ్డ అలసిపోయిందని సూచించే సంకేతం ఇదే. మీ బిడ్డ నిద్రపోకుండా నిరంతరం ఏడుస్తుంటే, మీరు మీ డాక్టర్ ను సంప్రదించాలి. కడుపు నొప్పి, జలుబు ఉంటే కూడా పిల్లలు నిద్రపోవడానికి అసౌకర్యంగా ఫీలవుతారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..