Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping DisOrders: ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచేది నిద్రేనని మీకు తెలుసా? నిద్ర సమస్యలతో మరణించే ప్రమాదం..

తగినంత నిద్ర లేకపోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. చాలా తక్కువ లేదా ఎక్కువ నిద్రపోవడం గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Sleeping DisOrders: ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచేది నిద్రేనని మీకు తెలుసా? నిద్ర సమస్యలతో మరణించే ప్రమాదం..
Sleeping Problem
Follow us
Srinu

|

Updated on: Feb 28, 2023 | 3:00 PM

ప్రశాంతమైన నిద్ర.. అంటే మనస్సు ప్రశాంతంగా ఉన్న సమయంలో తీసుకునే విశ్రాంతి. నిద్ర మన ఆరోగ్యం చాలా బాగుంటుందని వైద్య నిపుణులు పేర్కొంటూ ఉంటారు. అయితే అదే నిద్ర సరిగ్గా లేకపోతే ప్రాణాంతక వ్యాధులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. చాలా తక్కువ లేదా ఎక్కువ నిద్రపోవడం గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. స్లీప్ అప్నియా, స్లీప్ డిజార్డర్, రోగి నిద్రపోతున్నప్పుడు శ్వాసను పాజ్ చేయడం లేదా ఆపివేయడం వంటివి చేస్తుంది. ఇది అధిక రక్తపోటు, గుండెపోటు వంటి అనేక గుండె అనారోగ్య పరిస్థితులతో కూడా ముడిపడి ఉంటుంది. ఏ కారణం చేతనైనా 8 శాతం మరణాలకు పేలవమైన నిద్ర విధానాలు కారణమవుతాయని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. చిన్న వయస్సు నుంచే మంచి నిద్ర అలవాట్లను పెంపొందించుకుంటే దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

మంచి నిద్రతో జీవనకాలం మెరుగు

రోజులో శరీరానికి సరిపోయేలా నిద్రపోతే జీవనకాలం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంత నిద్రను పొందాలని నిపుణులు చెబుతున్నారు. 2013 నుంచి 2018 మధ్య కాలంలో దాదాపు 1.7 లక్షల మందిపై నిర్వహించిన సర్వేలో  తక్కువ స్లీప్ స్కోర్ ఉన్న వారితో పోలిస్తే, నాణ్యమైన నిద్ర ఉన్నవారు గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ లేదా ఇతర కారణాల వల్ల చనిపోయే అవకాశం తక్కువగా ఉందని వారు కనుగొన్నారు. ప్రశాంతమైన నిద్రను పొందే స్త్రీల కంటే పురుషులు ఎక్కువ రోజులు జీవిస్తారని కూడా తేలింది. దాదాపు స్త్రీలతో పోలిస్తే పురుషులు రెండున్నర సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారని నివేదికలు పేర్కొన్నాయి. నిద్రమాత్రలు వాడకుండా ప్రతి రోజు కచ్చితంగా 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. నిద్రపోయి లేచిన తర్వాత విశ్రాంతి దొరికింది అని మనస్సుకు అనిపిస్తే ప్రశాంత నిద్రకు సూచనగా భావించవచ్చు.  నిద్ర రుగ్మతలను నివారిస్తే కొన్ని అకాల మరణాలను కూడా నిరోధించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..

ఇవి కూడా చదవండి