Fasting Problems : ఉదయాన్నే టిఫిన్ స్కిప్ చేస్తున్నారా? ఉపవాసం పేరిట రాత్రిళ్లు భోజనం మానేస్తున్నారా? అయితే సమస్యలతో సావాసమే..

మనలో చాలా మంది ఉదయమే టిఫిన్ చేయడాన్ని స్కిప్ చేస్తారు. ఆడవారైతే పూజలు చేస్తూ రాత్రి సమయంలో ఉపవాసం ఉంటారు. అంతే కాదు మరికొంత మంది బరువు తగ్గాలనుకునేవారు కూడా ఉదయం లేదంటే రాత్రి సమయంలో ఏదో ఓ పూట తినడం మానేస్తారు.

Fasting Problems : ఉదయాన్నే టిఫిన్ స్కిప్ చేస్తున్నారా? ఉపవాసం పేరిట రాత్రిళ్లు భోజనం మానేస్తున్నారా? అయితే సమస్యలతో సావాసమే..
Fasting
Follow us
Srinu

|

Updated on: Feb 28, 2023 | 2:30 PM

సాధారణంగా వర్క్ ప్రెజర్, నైట్ లైఫ్ కారణంగా మనలో చాలా మంది ఉదయమే టిఫిన్ చేయడాన్ని స్కిప్ చేస్తారు. ఆడవారైతే పూజలు చేస్తూ రాత్రి సమయంలో ఉపవాసం ఉంటారు. అంతే కాదు మరికొంత మంది బరువు తగ్గాలనుకునేవారు కూడా ఉదయం లేదంటే రాత్రి సమయంలో ఏదో ఓ పూట తినడం మానేస్తారు. లంకణం దివ్య ఔషధం అనే నానుడి ఉందని కొంత మంది కొంచెం నీరసంగా ఉందని తినడం మానేస్తూ ఉంటారు. అయితే ఉపవాసం వల్ల మొత్తం చెడు జరుగకపోయిన కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతాయి. కానీ పవాసం రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని సూచించింది. అల్పాహారం దాటవేసినప్పుడు కూడా ప్రభావాలు గమనించబడ్డాయి. ఇటీవల వెల్లడైన ఓ పరిశోధనల ప్రకారం మెదడులో రోగనిరోధక కణాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనల ఆధారంగా, దీర్ఘకాలిక ఉపవాసం శరీరంపై దీర్ఘకాలిక ప్రభావాలను కలిగిస్తుందని వారు సూచించారు. 

ఎలుకలపై పరిశోధనలు

ఉపవాసం రోగనిరోధక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి, పరిశోధకులు రెండు సమూహాల ఎలుకలను విశ్లేషించారు. ఒక సమూహానికి మేల్కొన్న వెంటనే అల్పాహారం ఇచ్చారు. మరో సమూహానికి ఇవ్వలేదు. ఆ తర్వాత నిద్రలేచిన వెంటనే, నాలుగు గంటల తర్వాత, ఎనిమిది గంటల తర్వాత రెండు గ్రూపుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ రక్త నివేదికలను పరిశీలిస్తే అందులో మోనోసైట్‌ల సంఖ్యలో తేడాను కనిపించింది. ముఖ్యంగా ఈ ఇన్‌ఫెక్షన్లు, గుండె జబ్బులు, క్యాన్సర్‌తో పోరాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న తెల్ల రక్త కణాలు. మోనోసైట్లు ఎముక మజ్జలో ఉత్పత్తి అవుతాయి. తర్వాత అవి అక్కడ నుంచి అవి శరీరం గుండా ప్రయాణిస్తాయి. అన్ని ఎలుకలు బేస్‌లైన్ వద్ద ఒకే సంఖ్యలో మోనోసైట్‌లను కలిగి ఉన్నాయి. కానీ నాలుగు గంటల తర్వాత, ఉపవాసం ఉన్న ఎలుకలలో 90 శాతం మోనోసైట్లు రక్తప్రవాహం నుంచి అదృశ్యమయ్యాయి. ఎనిమిది గంటల సమయంలో సంఖ్య అవి మరింత క్షీణించాయి. అయినప్పటికీ, ఉపవాసం లేని సమూహంలోని మోనోసైట్‌ల సంఖ్య ప్రభావితం కాలేదని పరిశోధకుల అభిప్రాయం. ఉపవాసం ఉండే ఎలుకలలో నిద్రాణస్థితిలో ఉండటానికి మోనోసైట్లు ఎముక మజ్జకు తిరిగి ప్రయాణించాయని, అదే సమయంలో కొత్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుందని పరిశోధకులు కనుగొన్నారు. 24 గంటల ఉపవాసం తర్వాత ఎలుకలకు ఆహారాన్ని పెట్టినప్పుడు, ఎముక మజ్జలో దాక్కున్న మోనోసైట్లు కొన్ని గంటల్లో రక్తప్రవాహంలోకి తిరిగి వెళ్లాయి. అయితే ఈ మోనోసైట్‌లు ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షించడం లేదు. దీంతో శరీరం ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడంలో తక్కువ స్థాయిలో పని చేశాయి.

మెదడుపై మరింత ఒత్తిడి

ఉపవాసం సమయంలో మెదడు, మోనోసైట్‌ల మధ్య సంబంధాన్ని కూడా పరిశీలించారు. ఉపవాసం సమయంలో మెదడు మరింత ఒత్తిడితో ఉంటుందని గుర్తించారు. దీంతో ఇది రక్తం నుంచి ఎముక మజ్జకు మోనోసైట్‌ల వలసలను తక్షణమే ప్రేరేపిస్తుందని తేలింది. అలాగే ఇవి ఆహారం తిన్న కొద్దిసేపటికే రక్తప్రవాహంలోకి తిరిగి వస్తుంది. ఉపవాసానికి ఈ ఒత్తిడి ప్రతిస్పందన కూడా తోడు కావడంతో వారు ఆకలితో కోపగించుకునేలా చేస్తుందని నిపుణులు గుర్తించారు. అలాగే ఉపవాసం తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల పెద్ద స్థాయిలో మోనోసైట్‌ల పెరుగుదలకు దారితీయడంతో శరీర సామర్థ్యం కూడా ప్రభావితమవుతుందని తేలింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..