BP Control: మందులు వాడకుండా.. బీపీని కంట్రోల్ చేసే సింపుల్ టిప్స్

ఆధునిక జీవనశైలి, ఉద్యోగంలో ఒత్తిడులు, కుటుంబ పరిస్థితుల వల్ల చాలామంది అధిక బీపీకి గురవుతున్నారు. దీనిని కంట్రోల్‌ చేయడానికి విపరీతమైన మందులు వాడుతున్నారు. అయితే ఈ మందులు బీపీని కంట్రోల్‌ చేయడమేమో..

BP Control: మందులు వాడకుండా.. బీపీని కంట్రోల్ చేసే సింపుల్ టిప్స్
బీపీ రోగులు మద్యం సేవించకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని.. దీనివల్ల బీపీ పెరుగుతుందని పేర్కొంటున్నారు.
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 26, 2022 | 7:55 PM

ఆధునిక జీవనశైలి, ఉద్యోగంలో ఒత్తిడులు, కుటుంబ పరిస్థితుల వల్ల చాలామంది అధిక బీపీకి గురవుతున్నారు. దీనిని కంట్రోల్‌ చేయడానికి విపరీతమైన మందులు వాడుతున్నారు. అయితే ఈ మందులు బీపీని కంట్రోల్‌ చేయడమేమో కానీ వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటున్నాయి. కుప్పలు కుప్పలుగా బీపీ టాబ్లెట్లు మింగడం ఆరోగ్యానికి మంచిది కాదు. సహజసిద్దంగా కూడా బీపీని కంట్రోల్‌ చేయవచ్చు. దీనికోసం డాక్టర్లు రకరకాల సలహాలు ఇస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. హైపర్‌ టెన్సన్‌ తగ్గించాలంటే ఉపవాసం చేయడం బెస్ట్‌ ఎంపిక అని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల బీపీ దానంతట అదే కంట్రోల్ అవుతుందని సూచించారు. బీపీ మందులు మానేసి ఇలా చేస్తే మంచి ఉపశమనం దొరుకుతుందన్నారు. రక్తపోటును తగ్గించడానికి ఉపవాసంతో పాటు మద్యం, మాంసం, ఉప్పు తగ్గించాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు తినాలి. పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారంపై ఆధారపడాలి. ఇలాచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఉపవాసం కూడా వైద్యుల పర్యవేక్షణలో జరగాలి.

అధిక రక్తపోటు ఉన్న వ్యక్తి కేవలం మొక్కల ఆధారిత ఆహారం తినడం వల్ల బీపీ 7 పాయింట్లు తగ్గుతుందని డాక్టర్ నివేదించారు. మొక్కల ఆధారిత ఆహారం, తక్కువ మాంసాన్ని కలిపి తీసుకోవడం వల్ల రక్తపోటు 11 పాయింట్లు తగ్గుతుందని తెలిపారు.

రోజూ మద్యపానం చేసేవారు ఆల్కహాల్‌ను మానేయ్యాలి. ఇలా చేస్తే హై బీపీలో 5 పాయింట్ల తగ్గుదలని చూడవచ్చు. 10 పౌండ్లు బరువు తగ్గితే సిస్టోలిక్ ఒత్తిడిలో 7 పాయింట్ల తగ్గుదలకు కారణమవుతుంది. కనీసం 3 నెలల పాటు క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల బీపీ కొలతలో 9 పాయింట్లు తగ్గించవచ్చు. సోడియంను తగ్గించడం వల్లబీపీని 15 పాయింట్ల వరకు తగ్గించవచ్చు. పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాలు ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే బీపీ 18 పాయింట్లకు తగ్గించవచ్చు. ఉపవాసం చేసేటప్పుడు నీరు మాత్రమే తీసుకుంటే బీపీ 37 పాయింట్లకు తగ్గుతుంది. కానీ ఇది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..