Countries With No Airports: విమానాశ్రయాలే లేని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా? అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకు రవాణా..
ప్రపంచంలో కొన్ని దేశాల్లో అసలు విమానాశ్రయాలే లేవుని అనే విషయం మీకు తెలుసా? ఎలాంటి విమానాశ్రయాలు లేకపోయినా పొరుగు దేశాల సహాయ సహకారాలతో తమ వాణిజ్య అవసరాలను తీర్చుకుంటాయి.
మారుతున్న టెక్నాలజీ కారణంగా దేశ అవసరాలు కూడా మారుతున్నాయి. గతంలో `పడవల్లో చేసే రవాణా ఇప్పుడు మరింత స్పీడ్‌గా రావాలని విమానాల్లో చేస్తున్నారు. దీంతో ప్రతి దేశంలో విమానాశ్రయం ఉండడం అనేది తప్పనిసరైంది. వాణిజ్యపరంగా దేశాభివృద్ధి చెందాలంటే మన దగ్గర ఉండే ఉత్పత్తులను ఎగుమతి చేయడంతో దేశానికి అవసరమయ్యే ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం అంతే ముఖ్యం. కాబట్టి విమానాశ్రయాల వల్లే దేశ వాణిజ్య విభాగం ఆధారపడి ఉంటుంది. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో అసలు విమానాశ్రయాలే లేవుని అనే విషయం మీకు తెలుసా? ఎలాంటి విమానాశ్రయాలు లేకపోయినా పొరుగు దేశాల సహాయ సహకారాలతో తమ వాణిజ్య అవసరాలను తీర్చుకుంటాయి. అయితే ముఖ్యంగా చిన్న వైశాల్యం ఉన్న దేశాల్లో విమానాశ్రయాలు ఉండవు. అలా విమానాశ్రయాలు లేని దేశాలు ఏంటో ఓ సారి చూద్దాం.
వాటికన్ సిటీ
ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇక్కడ జనాభా కేవలం 800 మాత్రమే. ఇక్కడ విమానం దిగడానికి ఎక్కువ స్థలం లేదు. ప్రత్యామ్నాయ రవాణా కోసం నది లేదా సముద్రం కూడా లేదు. ప్రత్యేకంగా కాలినడకన వెళ్లగలిగే కొన్ని దేశాలలో ఇది కూడా ఒకటి. అయినప్పటికీ, రైలులో 30 నిమిషాల కంటే తక్కువ దూరంలో ఉన్న ఇతర విమానాశ్రయాలు చుట్టుపక్కల ఉన్నందున ఇక్కడి ప్రజలు విమాన ప్రయాణానికి ఇబ్బందిపడరు. ఈ దేశం రోమ్ నగర సరిహద్దుల లోపల ఉంది.
మొనాకో
మొనాకో వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలోని రెండవ అతి చిన్న దేశం. ఈ దేశంలో చుట్టూ మూడు వైపులా ఫ్రాన్స్ ఉంది. దీంతో సొంత విమానాశ్రయ సౌకర్యం లేదు. మొనాకోకు వెళ్లాలనుకుంటే ఫ్రాన్స్‌లోని నైస్ కోట్ డి’అజుర్ విమానాశ్రయంలో దిగిన తర్వాత క్యాబ్‌ను ద్వారా చేరుకోవచ్చు. లేదంటే పడవలో ప్రయాణించాలి.
శాన్‌మారినో
వాటికన్ సిటీ నుంచి చాలా దూరంలో ఉన్న శాన్ మారినో ప్రపంచంలోని పురాతన రాష్ట్రాల్లో ఒకటి. పూర్తిగా ఇటలీతో సరిహద్దు ఉంటుంది. ఈ దేశం కూడా చాాలా చిన్నది కాబట్టి ఇక్కడ కూడా విమానాశ్రయం లేదు. ఈ దేశం నుంచి సులువుగా ఇటలీకి చేరుకోవచ్చు. ఇటలీలోని రిమిని విమానాశ్రయం ఈ దేశవాసుల కోరికను తీరుస్తుంది. అలాగే ఫ్లోరెన్స్, బోలోగ్నా, వెనిస్, పిసా వంటి అనేక ఇతర విమానాశ్రయాలకు కూడా ఇక్కడ నుంచి సింపుల్‌గా వెళ్లవచ్చు.
లిచిన్ స్టెయిన్
ఈ దేశంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ విమానాశ్రయం లేదు. పైగా ఈ దేశం చుట్టు కొలత కేవలం 75 కిలోమీటర్ల మాత్రమే. ఈ దేశాన్ని తూర్పున రైన్, పశ్చిమాన ఆస్ట్రియన్ పర్వాతాలు ఉంటాయి. ఇక్కడ నుంచి దాదాపు 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న జ్యూరిచ్ విమానశ్రయం ద్వారా ఈ ప్రాంత ప్రజలు విమాన సౌకర్యాలు పొందుతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం