AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waking up at Midnight: రోజూ అర్ధరాత్రి మేల్కొటున్నారా.? అయితే నిజంగా మేల్కోవాల్సిందే.! లేకుంటే అంతే సంగతులు.!

సాధారణంగా అర్ధరాత్రి సమయంలో ఎందుకు మెలకువ వస్తుంది. అయితే దాహం వేసినప్పుడు, టాయిలెట్ వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో

Waking up at Midnight: రోజూ అర్ధరాత్రి మేల్కొటున్నారా.? అయితే నిజంగా మేల్కోవాల్సిందే.! లేకుంటే అంతే సంగతులు.!
Waking Up At Middle Of The Night
Anil kumar poka
|

Updated on: Dec 12, 2022 | 8:42 PM

Share

కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో అనే వారు ఇటీవల కాలంలో ఎక్కువగా కనపడుతున్నారు. రకరకాల టెన్షన్ లు, ఒత్తిడులతో సుఖవంతమైన మనిషికి నిద్ర కరువైపోతుంది. సాధారణంగా మనిషికి ఆరు నుంచి 8 ఎనిమిది గంటల నిద్ర అవసరం. అయితే విడతల వారీగా కాదు. అంటే నాలుగు గంటలు ఒకసారి, మరో మూడో గంటలు మరోసారి కాకుండా చూసుకోవాలి.లేకుంటే ఇదే పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. చాలా మందికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. మళ్లీ నిద్ర పట్టదు. ముఖ్యంగాఅర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో మేల్కోని మళ్లీ నిద్ర పట్టక ఇబ్బందులు పడతారు. అటువంటి వారు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే లివర్ సంబంధిత సమస్యలతో కూడా ఈ విధంగా మధ్యలో మధ్యలో నిద్రాభంగం కలుగుతూ ఉండవచ్చు. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఉందా! అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా మెలకువ వచ్చి, మళ్లీ నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే ఈ స్టోరీ చదివేయండి. దానికి గల కారణాలు, దాని నుంచి బయటపడేందుకు చేయాల్సిన వాటిపై నిపుణుల సలహాలను తెలుసుకోండి.

ఆ సమయంలో ఎందుకు మెలకువ వస్తుంది.. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో ఎందుకు మెలకువ వస్తుంది. అయితే దాహం వేసినప్పుడు, టాయిలెట్ వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఏమైనా పీడకల వచ్చినప్పుడు అకస్మాత్తుగా మేల్కోంటాం. ఎప్పుడో ఒకసారి ఇది జరిగే ఫర్వాలేదు గానీ.. ప్రతి రోజూ ఇలానే జరుగుతుంటే.. ఒకసారి మెలకువ వచ్చాక, మళ్లీ నిద్ర పట్టకపోతే.. మాత్రం మీరు నిజంగా మేల్కోవాల్సిందే. ఎందుకంటే లివర్ సంబంధిత సమస్యైనా కావచ్చు లేదా అధిక ఒత్తిడి.. ఇంకా ఇన్ సోమ్నియా కూడా అయ్యే అవకాశం ఉంది. ఇన్ సోమ్నియా అయితే మాత్రం మరింత జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే దీని వల్ల దీర్ఘకాలంలో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా జనాభాలో అన్ని వయసుల వారిలో ఈ ఇన్ సోమ్నియాతో దాదాపు 10 నుంచి 20 శాతం మంది బాధపడుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. గత రెండేళ్లలో పెద్ద వయస్సు వాళ్లలో ఇది 40 శాతం మందిలో ఉన్నట్లు లెక్క తేలింది.

ఇన్ సోమ్నియాకు కారణం.. ఇన్ సోమ్నియా కు గురయిన వ్యక్తి మధ్య రాత్రిళ్లలో మేల్కోని మళ్లీ నిద్రపోవడానికి ప్రయత్నించినా పడుకోలేరు. అటువంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి(స్ట్రెస్). ఈ స్ట్రెస్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అంతేకాక దీని వల్ల బ్లడ్ ప్రెజర్(బీపీ), హార్ట్ రేట్ కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. స్ట్రెస్, యాంగ్జైటీ కారణంగా లివర్ కూడా దెబ్బతింటుందని వివరిస్తున్నారు. అందుకనే వీలైనంత వరకూ బ్రెయిన్ స్ట్రయిన్ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. దీనిని అలాగే వదిలేస్తే శరీరంలోని వివిధ ప్రధాన అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంక రెండో కారణం వయస్సు. నిద్రకు వయస్సుతో లంకె. వయస్సు పెరిగే కొద్దీ నిద్రపోయే సమయం తగ్గిపోతూ ఉంటుంది. వయసు రీత్యా వాడాల్సి వచ్చే కొన్ని మందులు కూడా నిద్రలేమికి గురిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

దీని గురించి కూడా తెలుసుకోవాలి.. ఈ పరిస్థితులను అధిగమించాలంటే మొదటగా చేయాల్సింది నిద్ర సైకిల్ దెబ్బతినకుండా చూసుకోవాలి. నిద్ర ఉపక్రమించే క్రమంలో పలు రకాలను దశలను దాటుకుని మత్తు నిద్రలోకి మనిషి జారుకుంటాడు. మెలకువ స్టేజ్ నుంచి క్రమంగా నిద్రలోకి జారుకోవడం.. ఆ తర్వాత లైట్ స్లీప్.. డీప్ స్లీప్.. ఆ పై ర్యాపిడ్ ఐ మూవ్మెంట్(ఆర్ఈఎం) స్లీప్ అనే సైకిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ నిద్రపోయే సమయంలో ఈ సైకిల్స్ వస్తుంటాయి. ఒక్కో దశ ఎంత సమయం ఉంటుంది అనేది వ్యక్తిని బట్టి మారుతుంటుంది. వారు రోజులో చేసిన శారీరక శ్రమ వంటివి త్వరగా మత్తు నిద్రలోకి జారుకొనేందుకు అవకాశం కల్పిస్తాయి.

కొన్ని టిప్స్.. ఇన్ సోమ్నియా నుంచి బయటపడేందుకు నిపుణులు కొన్ని సలహాలు సూచిస్తున్నారు. వీటిని రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని చెబుతున్నారు. – నిద్రపోయే ముందు పాదాలను నీళ్లలో కాసేపు అలా నానాబెట్టాలి. అప్పుడు కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతారు. – నిద్రపోయే గంట ముందు బుక్స్ చదవడం.. మెడిటేషన్ చేయడం వంటివి చేయాలి. – కంప్యూటర్లు, టీవీలు, మొబైల్ ఫోన్లు వంటి అధిక కాంతినిచ్చే వస్తువులను ఎట్టిపరిస్థితులోనూ ఆన్ చేసి ఉంచకూడదు. దీని వల్ల బ్రెయిన్ పై ఒత్తిడి పెరుగుతుంది. – రూం టెంపరేచర్ తగినంత ఉంచుకోవాలి. – దిండు తగిన విధంగా ఏర్పాటుచేసుకోవాలి. – నిద్రకు మూడునాలుగు గంటల ముందే భోజనం చేసేయాలి.