Diphtheria: తరచూ గొంతులో నొప్పి, తేలికపాటి జ్వరంగా ఉంటోందా? ఈ ప్రాణాంతక వ్యాధి కారణం కావచ్చు..

వాతావరణ కారణాల రిత్యా ఒక్కోసారి గొంతు నొప్పి సమస్య తలెత్తుతుంది. ఇది శరీరంలో డిఫ్తీరియా వ్యాధికి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పలుచోట్ల ఈ వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. వైద్యులు అభిప్రాయం ప్రకారం.. డిఫ్తీరియా వ్యాధిని గల్గోటు అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి బారీన పడిన వారిలో గొంతు నొప్పితో పాటు, తేలికపాటి జ్వరం కూడా వస్తుంది. అంతేకాకుండా, డిఫ్తీరియా రోగికి శ్వాస తీసుకోవడంలో..

Diphtheria: తరచూ గొంతులో నొప్పి, తేలికపాటి జ్వరంగా ఉంటోందా? ఈ ప్రాణాంతక వ్యాధి కారణం కావచ్చు..
Diphtheria
Follow us

|

Updated on: Apr 17, 2024 | 11:36 AM

వాతావరణ కారణాల రిత్యా ఒక్కోసారి గొంతు నొప్పి సమస్య తలెత్తుతుంది. ఇది శరీరంలో డిఫ్తీరియా వ్యాధికి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పలుచోట్ల ఈ వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. వైద్యులు అభిప్రాయం ప్రకారం.. డిఫ్తీరియా వ్యాధిని గల్గోటు అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి బారీన పడిన వారిలో గొంతు నొప్పితో పాటు, తేలికపాటి జ్వరం కూడా వస్తుంది. అంతేకాకుండా, డిఫ్తీరియా రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెడలో వాపు, నిరంతర దగ్గు ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా చర్మం రంగు నీలం రంగులోకి మారవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

డిఫ్తీరియా ఎందుకు వస్తుంది? దానిని ఎలా నివారించాలి?

డిఫ్తీరియా వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుందని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా గాలిలో ఉంటుంది. ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి గొంతులో ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాసకోశంలో పొర ఏర్పడుతుంది. దీని కారణంగా రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాడు. ఆ తర్వాత పొర నుంచి బ్యాక్టీరియా రక్తం ద్వారా గుండె, మెదడుకు వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ గుండె, మెదడును దెబ్బతీస్తుంది. అందుకే ఈ వ్యాధిని తేలికగా తీసుకోకూడదు.

డిఫ్తీరియా ఎలా వ్యాపిస్తుంది?

డిఫ్తీరియా కూడా ఒక విధమైన ప్రమాదకర వ్యాధి. ఈ వ్యాధి నివారణకు చికిత్స గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి, డిఫ్తీరియా అనేది ఒక అంటు వ్యాధి. ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశం ఉందని డాక్టర్ అజయ్ కుమార్ వివరించారు. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు డిఫ్తీరియా వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి నివారణకు టీకా ఉంది.

ఇవి కూడా చదవండి

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

పిల్లల్లో డిఫ్తీరియా కేసులు ఎక్కువగా వస్తాయని డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలలో ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డిఫ్తీరియా చికిత్స కోసం, శిశువులు. పిల్లలరే చిన్నతనంలోనే ఈ టీకాను వేయించాలి.

డిఫ్తీరియాను ఎలా నివారించాలి?

  • డిఫ్తీరియా వ్యాధి సోకిన వ్యక్తిని దూరంగా ఉంచాలి
  • రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి
  • రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఆకుపచ్చ కూరగాయలు తినాలి
  • శిశువులు, పిల్లలకు టీకాలు వేయించాలి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
తమన్నా, రాశీఖన్నా బాక్‌ రెడీ.! | మరింత గ్రాండ్‌గా చిరు విశ్వంభర..
తమన్నా, రాశీఖన్నా బాక్‌ రెడీ.! | మరింత గ్రాండ్‌గా చిరు విశ్వంభర..
సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!
సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!
సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!
గ్లాసు సింబల్‌ కేటాయింపు, కూటమి ఓట్లకు గండి పడేనా..?
గ్లాసు సింబల్‌ కేటాయింపు, కూటమి ఓట్లకు గండి పడేనా..?
వేలంలో వేస్ట్ అని వదిలేశారు.. కట్ చేస్తే.. ఆ జట్టుకే హిట్టింగ్.!
వేలంలో వేస్ట్ అని వదిలేశారు.. కట్ చేస్తే.. ఆ జట్టుకే హిట్టింగ్.!
తల్లి అయ్యేందుకు ట్రై చేస్తున్న మెహ్రీన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో..
తల్లి అయ్యేందుకు ట్రై చేస్తున్న మెహ్రీన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో..
పోలింగ్ జరగకుండానే బీజేపీ ఖాతాలో చేరనున్న 3 లోక్‌సభ సీట్లు!
పోలింగ్ జరగకుండానే బీజేపీ ఖాతాలో చేరనున్న 3 లోక్‌సభ సీట్లు!