- Telugu News Photo Gallery Sleeping Tips: Sleeping Without A Pillow Is It Good Or Bad? Know Details here
Sleeping Tips: తలగడతో నిద్రిస్తే మంచిదా? లేకుండా నిద్రిస్తే మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మీకు చాలా కాలంగా భుజం, మెడ నొప్పి వస్తోండా? డాక్టర్‌ను సంప్రదిస్తే దిండు లేకుండా పడుకోవాలని చెప్పారా? అసలు దిండు లేకుండా నిద్రిస్తే ఆరోగ్యంపై దుష్ర్ఫభావాలు ఏమైనా పడతాయా? అనే సందేహాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అయితే మీరీ విషయాలు తెలుసుకోవాల్సిందే.. చాలా మందికి తల కింద రెండు దిండ్లు పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. డాక్టర్ సూచనల మేరకు ఇప్పుడు ఒకటి కూడా లేకుండా నిద్రపోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది..
Updated on: Apr 17, 2024 | 11:53 AM

మీకు చాలా కాలంగా భుజం, మెడ నొప్పి వస్తోండా? డాక్టర్‌ను సంప్రదిస్తే దిండు లేకుండా పడుకోవాలని చెప్పారా? అసలు దిండు లేకుండా నిద్రిస్తే ఆరోగ్యంపై దుష్ర్ఫభావాలు ఏమైనా పడతాయా? అనే సందేహాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అయితే మీరీ విషయాలు తెలుసుకోవాల్సిందే..

చాలా మందికి తల కింద రెండు దిండ్లు పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. డాక్టర్ సూచనల మేరకు ఇప్పుడు ఒకటి కూడా లేకుండా నిద్రపోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఫలితంగా రాత్రంతా దాదాపు నిద్రపట్టని పరిస్థితి దాపురిస్తుంది. అసలు దిండ్లు వాడటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తామో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.

దిండుపై పడుకోవడం వల్ల అనేక శారీరక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అన్నింటి కంటే దీని ప్రభావం వెన్నెముకపై ఉంటుంది. అందుకే పడుకునేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉంచడం మంచిది.

నిద్రపోయేటప్పుడు చాలా మందికి రెండు దిండ్లు అవసరమవుతాయి. కానీ ఎక్కువ సేపు రెండు దిండ్లు వాడటం వల్ల వెన్నెముక దెబ్బతింటుంది. అలాగే ఎత్తు ఎక్కువగా ఉండే దిండును ఉపయోగించడం వల్ల మెడ నొప్పి సమస్య తలెత్తుతుంది. మెడ, వెన్ను సమస్యలతో పాటు తలనొప్పి సంభవిస్తుంది.

ఎత్తైన దిండును ఉపయోగించడం వల్ల భుజాలు, చేతులలోని నరాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వలన నొప్పి వస్తుంది. ఇలాగే చాలా కాలం పాటు ఎత్తైన దిండును ఉపయోగిస్తే వెన్నెముక సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి దిండును ఉపయోగించడం వల్ల వెన్నెముఖ కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది నొప్పిని పెంచుతుంది. కండరాలు దెబ్బతినవచ్చు. కాబట్టి అవసరమైతే సన్నని దిండుపై నిద్రించడానికి ప్రయత్నించాలి. అసలు దిండు లేకుండా నిద్రపోతే ఇంకా మంచిది. మొదట్లో కొంత అసౌకర్యంగా అనిపించినా తర్వాత అలవాటు అవుతుంది.





























