డయాబెటిస్ రోగులకు బిగ్ అలర్ట్.. ఈ పండ్లు విషంతో సమానం.. పొరపాటున కూడా తినకండి..

మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపడంతోపాటు ప్రాణాంతకంగా మారుతుంది.. అందుకే.. మధుమేహ రోగులు రక్తంలో చెక్కెరను అదుపులో ఉంచడంలో సహాయపడే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.

డయాబెటిస్ రోగులకు బిగ్ అలర్ట్.. ఈ పండ్లు విషంతో సమానం.. పొరపాటున కూడా తినకండి..
Diabetes
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 13, 2024 | 4:20 PM

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు.. అయితే.. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే.. రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది.. ఇలాంటి పరిస్థితుల్లో డయాబెటిస్ బాధితులు.. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడే ఆహారాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. చాలా రకాల పండ్లు ఆరోగ్యానికి మేలు చేసేవిగా పరిగణించబడుతున్నప్పటికీ, కొన్ని పండ్లు అధిక చక్కెర కంటెంట్ కలిగి ఉంటాయి.. ఇవి డయాబెటిక్ రోగులకు హానికరం.. అందుకే.. తీసుకునే పండ్లపై అవగాహన కలిగిఉండటం చాలా ముఖ్యం.. డయాబెటిక్ పేషెంట్లకు విషపూరితమైనవిగా భావించే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం రోగులు ఈ 4 పండ్లకు దూరంగా ఉండండి..

పైనాపిల్: పైనాపిల్ చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరను కలిగి ఉంటుంది.. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంది.. దీని కారణంగా ఈ పండు మధుమేహ రోగులకు ముప్పుగా పరిగణిస్తారు.. పైనాపిల్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు అసాధారణంగా పెరుగుతాయి… ఇది రక్తంలో చక్కెర నియంత్రణను కోల్పోయేలా చేస్తుంది.

ద్రాక్ష: ద్రాక్షలో అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ ఉంటుంది.. ఇది డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ద్రాక్ష తినడం వల్ల చక్కెర స్థాయి వెంటనే పెరుగుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు ప్రమాదకరమైన సంకేతం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ద్రాక్షను పరిమిత పరిమాణంలో తీసుకోవడం లేదా అస్సలు తీసుకోకపోవడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.

మామిడి: మామిడిని పండ్లలో రారాజుగా పేర్కొంటారు.. అయితే ఇది డయాబెటిక్ రోగులకు ప్రమాదం కలిగిస్తుంది. మామిడిలో చక్కెర, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. మామిడిని తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరుగుతుంది. ఇది డయాబెటిక్ రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.

అరటిపండు: అరటిపండులో అధిక సహజ చక్కెర ఉంటుంది.. దాని గ్లైసెమిక్ సూచిక కూడా మధ్యస్థం నుంచి ఎక్కువ వరకు ఉంటుంది. అరటిపండు తినడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది.. ఇది డయాబెటిక్ రోగులకు మంచిది కాదు.. ముఖ్యంగా పండిన అరటిపండు మధుమేహ రోగులకు మరింత ప్రమాదకరమని నిరూపించవచ్చు.

పోషకాహార నిపుణుల సలహా ఏంటంటే..

మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను జాగ్రత్తగా తీసుకోవాలి. అధిక చక్కెర కంటెంట్ ఉన్న పండ్లకు బదులుగా, వారు ఆపిల్, బెర్రీలు లేదా బొప్పాయి వంటి తక్కువ GI పండ్లను తీసుకోవచ్చు. ఏదైనా పండును తినే ముందు మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.. తద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంచుకోవచ్చు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!