AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Depression: మాటిమాటికీ ఇలాంటి లక్షణాలు మీలో కూడా కనిపిస్తున్నాయా? అయితే వెంటనే మీకు బ్రేక్‌ అవసరం..

నేటి కాలంలో చాలా మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం గతి తప్పిన జీవనశైలి. అధిక ఒత్తిడిని సరిగ్గా మేనేజ్‌ చేయకుండే పరిస్థితి చేయిదాటి పోతుంది. అయితే చాలా మంది ఒత్తిడిని దినచర్యలో భాగంగా పరిగణించారు. ఫలితంగా సమస్య క్రమంగా ఆందోళన, ఒంటరితనం, నిరాశకు దారితీస్తుంది. ఒక్కోసారి పరిస్థితి తీవ్రంగా మారి, విపరీతాలకు దారి తీస్తుంది. దీన్ని నివారించడానికి ఒత్తిడి, వ్యక్తిగత జీవిత సమస్యల నుంచి..

Depression: మాటిమాటికీ ఇలాంటి లక్షణాలు మీలో కూడా కనిపిస్తున్నాయా? అయితే వెంటనే మీకు బ్రేక్‌ అవసరం..
Depression
Srilakshmi C
|

Updated on: Jul 16, 2024 | 1:26 PM

Share

నేటి కాలంలో చాలా మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం గతి తప్పిన జీవనశైలి. అధిక ఒత్తిడిని సరిగ్గా మేనేజ్‌ చేయకుండే పరిస్థితి చేయిదాటి పోతుంది. అయితే చాలా మంది ఒత్తిడిని దినచర్యలో భాగంగా పరిగణించారు. ఫలితంగా సమస్య క్రమంగా ఆందోళన, ఒంటరితనం, నిరాశకు దారితీస్తుంది. ఒక్కోసారి పరిస్థితి తీవ్రంగా మారి, విపరీతాలకు దారి తీస్తుంది. దీన్ని నివారించడానికి ఒత్తిడి, వ్యక్తిగత జీవిత సమస్యల నుంచి కాస్త విరామం తీసుకోవాలి. అధిక పని ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలో అసమతుల్యత, వ్యక్తిగల సంబంధాల విచ్ఛిన్నం, పని చేసే చోట విషపూరిత వాతావరణ కూడా భావోద్వేగ అలసటకు దారితీయవచ్చు. కారణం ఏమైనప్పటికీ ఈ సమస్యలన్నింటికీ విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మానసిక అలసట, ఒత్తిడి, నిరాశను పారదోలొచ్చు. అసలు మీరు డిప్రెషన్‌లో ఉన్నారా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే ఈ కింది సంకేతాలు చెప్పేస్తాయి. అవేంటో తెలుసుకోండి..

కారణం లేకుండానే చిరాకుగా అనిపించడం

చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి గురై అధిక కోపానికి గురైతే అది డిప్రెషన్ అని అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో మీరు రోజువారీ పని సమస్యల నుంచి కాస్త విరామం తీసుకోవాలి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉంటే, వాటి నుంచి విరామం తప్పక తీసుకోవాలి. వీటి తాలూకు ఆలోచనల నుంచి బయటపడటానికి తగినంత సమయం ఇవ్వాలి. మీరు మీ కోసం సమయం కేటాయించుకోవాలి.

పనిలో ఏకాగ్రత కోల్పోవడం

మీరు చేసే పనిలో ఏకాగ్రత పెట్టలేకపోతే, మీ మనస్సులో ఎటువంటి కారణం లేకుండా అలజడి రేగుతుంటే తప్పక విరామం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

పేలవమైన నిద్ర

సరైన ఆహారం తీసుకుని, పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పటికీ నిస్సత్తువ ఆవరించడం, కంటి నిండా నిద్రపోలేకపోవడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోలేకపోవడం లేదా పదే పదే మేల్కొనడం వంటివి అనుభవిస్తే.. అది మానసిక సమస్య కావచ్చు. ఇవన్నీ మానసిక అలసట కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో పని నుంచి విరామం తీసుకోవాలి.

భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం

పదేపదే మానసికంగా బలహీనంగా భావించడం, ఏడ్వడం, సులభంగా కోపం తెచ్చుకోవడం వంటి భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవం కూడా డిప్రెషన్‌కు దారి తీస్తాయి. తరచూ ఇలా జరుగుతూ ఉన్నా.. దుఃఖం, కాసేపటికే ఆనందం, అకారణంగా కన్నీళ్లు కార్చడం, పగ, విధ్వేషం… వంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. ఇవి కూడా డిప్రెషన్‌కు సంకేతాలే.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.