AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మహిళలు గర్భం దాల్చలంటే ఈ తప్పులు అస్సలు చేయకూడదు

పెళ్లి తర్వాత తీసుకోవలసిన కొన్ని చర్యల గురించి దంపతులు పెద్దగా పట్టించుకోరు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యభర్తలు సంభోగం సమయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. భార్యభర్తలు సంభోగం సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్లే వారికి సమస్యగా మారవచ్చు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం

Health Tips: మహిళలు గర్భం దాల్చలంటే ఈ తప్పులు అస్సలు చేయకూడదు
Lifestyle
Subhash Goud
|

Updated on: Jul 16, 2024 | 12:50 PM

Share

పెళ్లి తర్వాత తీసుకోవలసిన కొన్ని చర్యల గురించి దంపతులు పెద్దగా పట్టించుకోరు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యభర్తలు సంభోగం సమయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. భార్యభర్తలు సంభోగం సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్లే వారికి సమస్యగా మారవచ్చు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంటేందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Relationship Tips: భార్యలు పుట్టింటికి వెళ్లిన తర్వాత భర్తలు ఎక్కువ ఆ పనే చేస్తారట!

  1. మనలో చాలా మంది జంటలు సంభోగం తర్వాత తీసుకోవలసిన కొన్ని చర్యల గురించి తెలుసుకోరు. దీని కారణంగా సంభోగం తర్వాత వెంటనే చేసే కొన్ని తప్పులు స్త్రీలకు సమస్యలను కలిగిస్తాయి. అందుకే త్వరగా గర్భం దాల్చాలనుకునే వారు కొన్ని టిప్స్‌ పాటించడం మంచిది.
  2. కొంతమంది సంభోగం తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడానికి వాష్‌రూమ్‌కి వెళతారు. కానీ ఇది మంచిది కాదు. వీలైతే సంభోగం తర్వాత దాదాపు 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.
  3. ఇవి కూడా చదవండి
  4. సంభోగం ముగిసిన వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదు. కొందరు ఈ సమయంలో వేడి నీటితో స్నానం చేస్తారు. అయితే ఇది మంచిది కాదు. ఎందుకంటే సాధారణంగా సంభోగం తర్వాత యోని కండరాలు రిలాక్స్‌గా తెరుచుకుంటాయి. అందుకే వేడి నీటి స్నానం చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
  5. సంభోగం తర్వాత వెంటనే మూత్ర విసర్జన కూడా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్ఫెక్షన్ భయం ఉంటే కాటన్ తో శుభ్రం చేసుకోవడం మంచిదంటున్నారు.
  6. ఏ కారణం చేతనైనా సంభోగం తర్వాత తడి తొడుగులు ఉపయోగించవద్దు. ఈ వైప్స్‌లోని సువాసన, చెమటను పీల్చుకోవడానికి ఉపయోగించే కొన్ని రసాయనాలు సున్నితమైన చర్మంపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి.
  7. 30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత వెంటనే పడుకోకుండా, కాసేపు అటూ ఇటూ తిరిగిన తర్వాతే పడుకోవాలి. దీని వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.
  8. సంభోగం తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగాలి. ఇది మీ శరీరానికి చాలా మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. సంబంధిత అంశం గురించి నిపుణుల సలహాలు, సూచనల మేరకే అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి