Poppy Seeds: ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..

గసగసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. ముఖ్యంగా భారతీయులు గసగసాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. గసగసాలను ఎక్కువగా మసాలా తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మసాలా కూరలు తయారు చేసేటప్పుడు వీటిని ఎక్కువగా వాడతారు. గసగసాలతో మంచి కమ్మని టేస్ట్ కూడా వస్తుంది. గసగసాలను కేవలం రుచి కోసమే తింటున్నాం అనుకుంటే పొరపాటే. మనం వాడే ఆహార పదార్థాల నుంచి ఏదో ఒక ప్రయోజనమే కానీ..

Poppy Seeds: ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
Poppy Seeds
Follow us

|

Updated on: Jul 16, 2024 | 1:41 PM

గసగసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. ముఖ్యంగా భారతీయులు గసగసాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. గసగసాలను ఎక్కువగా మసాలా తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మసాలా కూరలు తయారు చేసేటప్పుడు వీటిని ఎక్కువగా వాడతారు. గసగసాలతో మంచి కమ్మని టేస్ట్ కూడా వస్తుంది. గసగసాలను కేవలం రుచి కోసమే తింటున్నాం అనుకుంటే పొరపాటే. మనం వాడే ఆహార పదార్థాల నుంచి ఏదో ఒక ప్రయోజనమే కానీ.. నష్టాలు చాలా తక్కువ. అలాగే గసగసాలను ఉపయోగిస్తున్నాం అంటే.. వాటితో ఎన్నో బెనిఫిట్స్ ఉండే ఉంటాయి. గసగసాల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గసగసాల్లో పోషకాలు:

మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, క్యాల్షియం ఉంటాయి.

పేగు ఆరోగ్యం:

గసగసాలను తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పేగుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. గసగసాలు తినడం వల్ల పేగుల్లో ఉండే మలినాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. మలబద్ధకం వంటి సమస్య తగ్గుతుంది. కడుపులో నొప్పి, ఉబ్బరం కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

గుండె పదిలం:

గసగసాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గసగసాల్లో ఉండే ముఖ్యమైన ఖనిజాలు గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. గుండె సమస్య ఉన్నవారు గసగసాలను ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది.

సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు:

గసగసాల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కేవలం శరీర ఆరోగ్యానికే కాకుండా.. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. గసగసాలను తీసుకోవడం యంగ్‌గా ఉంటారు. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

సంతానోత్పత్తి పెరుగుతుంది:

మహిళల్లో సంతానోత్పత్తి పెరగడానికి కూడా గసగసాలు హెల్ప్ చేస్తాయి. ఇందులో ఖనిజాలు.. పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయ పడతాయి.

ఎముకలు బలంగా ఉంటాయి:

గసగసాల్లో క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. గసగసాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. చిన్న పిల్లలకు వీటిని ఆహారంలో చేర్చడం వల్ల త్వరగా ఎముకలు విరిగిపోకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని
10 మంది మొబైల్ యూజర్లలో 9 మందికి కాల్ డ్రాప్ సమస్య..కీలక నివేదిక
10 మంది మొబైల్ యూజర్లలో 9 మందికి కాల్ డ్రాప్ సమస్య..కీలక నివేదిక
ఓ వైపు క్యాన్సర్ బాధిస్తున్నా షూటింగ్‌లో పాల్గొన్న నటి
ఓ వైపు క్యాన్సర్ బాధిస్తున్నా షూటింగ్‌లో పాల్గొన్న నటి
4ఏళ్ల బాలుడి పై ఒక్కసారిగా కుక్కలు దాడి..
4ఏళ్ల బాలుడి పై ఒక్కసారిగా కుక్కలు దాడి..
అభిమానులతో కలిసి రక్తదానం చేసిన హీరో సూర్య.. వీడియో చూశారా?
అభిమానులతో కలిసి రక్తదానం చేసిన హీరో సూర్య.. వీడియో చూశారా?
ఈ రోజు ఎపిసోడ్‌లో అంతా అయోమయం గందరగోళం.. నవ్వులే నవ్వులు..
ఈ రోజు ఎపిసోడ్‌లో అంతా అయోమయం గందరగోళం.. నవ్వులే నవ్వులు..