AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: పొగ తాగేవారి పక్కనే ఉంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని అందరికి తెలుసు.. కానీ పొగ తాగేవారు మాత్రం మానడం లేదు...

Health: పొగ తాగేవారి పక్కనే ఉంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..
Smoking
Srinivas Chekkilla
| Edited By: |

Updated on: Jan 03, 2022 | 9:45 AM

Share

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని అందరికి తెలుసు.. కానీ పొగ తాగేవారు మాత్రం మానడం లేదు. వారు అనారోగ్యంపాలు అవడమే కాకుండా పక్కవారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో సిగరెట్ తాగేవారు పెరిగిపోయారు. సిగరెట్ తాగడం అనేది నేటి రోజుల్లో ఒక ట్రెండ్‎గా మారిపోయింది. సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది అని తెలిసినప్పటికీ ఎవరు జాగ్రత్త పడటం లేదు అని చెప్పాలి. అయితే సిగరెట్ తాగుతున్న వారు వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవడమే కాదు పక్కన ఉన్న వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని నిపుణులు చెబుతూనే ఉన్నారు. సిగరెట్ తాగుతున్న వారి పక్కన ఉన్న వారు ఆ పొగను పీల్చడం వల్ల వారు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.

సాధారణంగా ఎవరైనా సిగరెట్ తాగుతుంటే పక్కనున్న వారు ఎవరో సిగరెట్ తాగితే మనకు ఏమవుతుందిలే అంటూ అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే పక్కన ఎవరో సిగరెట్ తాగుతున్నప్పటికీ అతను బయటకు వదిలే పొగ పీలిస్తే పక్కవాళ్ల ఆరోగ్యానికి కూడ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుంది. చిన్నప్పుడు ఇతరులు వదిలిన సిగరెట్ పొగను పీల్చడం వల్ల ప్రభావానికి గురైన ఆడ పిల్లల్లో పెద్దయ్యాక కీళ్ల నొప్పులు తలనొప్పి ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది.

Read Also..  Bandi Sanjay: బండి సంజయ్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. కరీంనగర్‎లో ఉద్రిక్తత..