Cholesterol Control Drink: ఈ డ్రింక్స్‌తో చెడు కొలెస్ట్రాల్‌కు సులభంగా చెక్ పెట్టవచ్చు.. ఇంకా బోలెడన్ని లాభాలు..!

Cholesterol Control Drink: కొలెస్ట్రాల్ నియంత్రణ పానీయం: కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి అన్ని రకాల చిట్కాలు ఉన్నాయి. కానీ కొన్ని పానీయాల ద్వారా దానిని..

Cholesterol Control Drink: ఈ డ్రింక్స్‌తో చెడు కొలెస్ట్రాల్‌కు సులభంగా చెక్ పెట్టవచ్చు.. ఇంకా బోలెడన్ని లాభాలు..!
Cholesterol
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jun 06, 2022 | 6:36 AM

Cholesterol Control Drink: కొలెస్ట్రాల్ నియంత్రణ పానీయం: కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి అన్ని రకాల చిట్కాలు ఉన్నాయి. కానీ కొన్ని పానీయాల ద్వారా దానిని నియంత్రించవచ్చు. అలాంటి పానీయాలు ఏవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం సమస్యను దూరం చేసుకునేందుకు పలు రకాల డైట్లను అనుసరిస్తున్నారు. అయితే.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, అధిక బరువును తగ్గించుకోవడానికి పలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. లేకపోతే తరువాత అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. ఇంట్లోనే పలు చిట్కాలను పాటించి కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు.

వాస్తవానికి శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి మరొకటి చెడు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో.. అధిక సమస్యతో బాధపడుతున్న వారు జీవనశైలిని తప్పనిసరిగా మార్చుకోవాలి. నిత్యం వ్యాయామం కూడా చేయాలి. ముఖ్యంగా కొన్ని రకాల పానీయాలను తీసుకొని అధిక కొవ్వును సులభంగా నియంత్రించవచ్చు. ఆ పానీయాలు ఏంటీ..? వాటి ద్వారా అధిక కొవ్వును ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

గ్రీన్ టీ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది..

ఇవి కూడా చదవండి

గ్రీన్-టీ బరువును తగ్గించడమే కాకుండా, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రించగలదు. అందుకే ప్రతిరోజూ గ్రీన్ టీ తాగాలని.. అప్పుడే మీరు ఆశించిన ఫలితాలను పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్‌టీలో కొవ్వును తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటున్నారు.

టమోటా రసంతో కొలెస్ట్రాల్‌కు చెక్..

టొమాటో జ్యూస్‌తో శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుకోవచ్చు. దీని కోసం మీరు ప్రతిరోజూ ఒక గ్లాసు టమాట రసాన్ని తాగాలి. అయితే.. పలు సమస్యలతో బాధపడుతున్న రోగులు దీనిని తాగడానికి ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

వోట్ మిల్క్‌తో ప్రయోజనం..

ఓట్ మిల్క్‌తో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. వాస్తవానికి ఇది బీటా-గ్లూకాన్ అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది. దీనిలోని లక్షణాలను కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి