Health: అజీర్తి, కడుపులో మంటతో బాధపడుతున్నారా.? ఈ సింపుల్‌ టిప్స్‌తో వెంటనే రిజల్ట్‌..

Health: మారుతోన్న జీవనశైలి కారణంగా అనారోగ్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది జీర్ణ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు..

Health: అజీర్తి, కడుపులో మంటతో బాధపడుతున్నారా.? ఈ సింపుల్‌ టిప్స్‌తో వెంటనే రిజల్ట్‌..
Follow us

|

Updated on: Jun 05, 2022 | 9:46 PM

Health: మారుతోన్న జీవనశైలి కారణంగా అనారోగ్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది జీర్ణ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అసిడిటీ, అల్సర్లు సాధారణంగా మారిపోయాయి. ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి.

ఇక ఇలాంటి సమస్య ఎదురైన వెంటనే చాలా మంది ట్యాబ్లెట్ వేసుకుంటారు. అయితే ఈ సమస్యను తగ్గించేందుకు కొన్ని సహజ పద్ధతులు ఉన్నాయనే విషయం మీకు తెలుసా.? ఉదర సంబంధిత వ్యాధులకు చెక్‌ పెట్టే అలాంటి కొన్ని నేచురల్‌ టిప్స్‌ మీకోసం..

* కొందరికి తిన్న వెంటనే కడుపులో మంటగా ఉంటుంది. అలాంటి వారు చల్లని పాలు తాగితే వెంటనే ఫలితం ఉంటుంది. పాలలోని క్యాల్షియం కడుపులో విడుదలయ్యే ఆమ్లాల తీవ్రతను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

* జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి జీలకర్ర మంచి ఔషధంగా పనిచేస్తుంది. అర టీస్పూన్ వాము, జీలకర్రను గ్లాసులో నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయం లేవగానే పరగడపున ఆ నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది.

* జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గాలంటే గులాబీ రెక్కలు వేసి మరిగించిన పాలను రోజూ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

* కడపులో మంటగా ఉన్న వాళ్లు ముల్లంగా రసం కడుపు మంట తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్‌ ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

* కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు కొన్ని పుదీనా ఆకులను నీటిలో కలిపి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..