AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana Beneftis : అరటిపండును ఖాళీ కడుపుతో తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

Banana Beneftis & Risks: అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆకలేసినప్పుడు ఒక్క అరటిపండు తింటే చాలు కడుపు

Banana Beneftis : అరటిపండును ఖాళీ కడుపుతో తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
Banana
Shiva Prajapati
|

Updated on: Jun 05, 2022 | 2:22 PM

Share

Banana Beneftis & Risks: అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆకలేసినప్పుడు ఒక్క అరటిపండు తింటే చాలు కడుపు నిండిపోతుంది. అరటి పండులో ఐరన్‌తో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో అరటిపండు తింటే.. అందులో ఉండే ఐరన్ కంటెంట్‌ను శరీరం గ్రహించి, రక్తంలో హిమోగ్లోబిన్ కంటెంట్‌ను పెంచుతుంది. తద్వారా రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అరటిపండు తింటే బరువు తగ్గే అవకాశం.. అరటి పండును తినడం వల్ల బరువు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. దీనిని తింటే కడుపు త్వరగా నిండినట్లుగా అనిపిస్తుంది. ఫలితంగా తక్కువ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా బరువు తగ్గడంలో ఉపకరిస్తుంది.

పక్షవాతాన్ని దూరం చేసే శక్తి.. అన్ని ఎనర్జీ డ్రింక్స్ కంటే అరటి పండులో శక్తి ఎక్కువగా ఉంటుంది. అరటిపండులో పక్షవాతాన్ని దూరం చేసే శక్తి కూడా ఉంది.

చర్మకాంతిని పెంచుతుంది.. అరటిపండు చర్మ కాంతిని కాపాడుతుంది. చర్మం ముడుతలు పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. అరటి పండులో గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించే కంటెంట్స్ చాలా ఉన్నాయి. ఐరన్, పొటాషియం, మెగ్నీషియం కంటెంట్ గుండె పదిలంగా ఉండేందుకు సహకరిస్తాయి.

ఖాళీ కడుపుతో అరటిపండును తినొచ్చా? ఖాళీ కడుపుతో అరటిపండు తినవచ్చా? అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అయితే, మన శరీరం ప్రతిరోజూ పనిచేయడానికి మన ఆహారంలో పోషకాలు చాలా అవసరం. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా ఆకలి సమస్యను దూరం చేస్తాయి. అయితే, ఖాళీ కడుపుతో అరటి తింటే ఎంత ప్రయోజనం కలుగుతుంది అనేదే చాలామందిలో మెదిలే సందేహం. ఈ ప్రశ్నకు ఆరోగ్య నిపుణులు సమాధానం చెబుతున్నారు. దాదాపు ఖాళీ కడుపుతో అరటిపండు తినొద్దనే సూచిస్తున్నారు. ఎందుకంటే 100 గ్రాముల అరటి పండులో 12 నుంచి 14 గ్రాముల చక్కెర కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ని పెంచుతుంది. అందుకే ఖాళీ కడుపుతో దీనిని తినొద్దని చెబుతున్నారు.