AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colorectal Cancer:పెద్దపేగు క్యాన్సర్‌ లక్షణాలివే.. ఆ వ్యక్తులకే ఈ రిస్క్ ఎక్కువ..!

మన జీర్ణవ్యవస్థలో చివరన ఉండే పెద్దపేగు.. శరీరంలోనే కీలకమైన విధులు నిర్వహిస్తుంది. ఇది ఆహారంలోని నీటిని, పొటాషియం, కొవ్వులో కరిగే

Colorectal Cancer:పెద్దపేగు క్యాన్సర్‌ లక్షణాలివే.. ఆ వ్యక్తులకే ఈ రిస్క్ ఎక్కువ..!
Colorectal Cancer Symptoms
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 06, 2023 | 9:17 AM

Share

పెద్దప్రేగు క్యాన్సర్ స్క్రీనింగ్‌ ప్రాముఖ్యతను హైలైట్‌ చేయడానికి, పెద్దపేగు క్యాన్సర్‌ ప్రమాదం తగ్గించే.. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడానికి ఈ మార్చి నెలను కొలొరెక్టల్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. అయితే మన జీర్ణవ్యవస్థలో చివరన ఉండే పెద్దపేగు.. శరీరంలోనే కీలకమైన విధులు నిర్వహిస్తుంది. ఇది ఆహారంలోని నీటిని, పొటాషియం, కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించి శరీరానికి అందిస్తుంది. అంతేకాక శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. దీన్ని వైద్య భాషలో కోలన్‌ అంటారు. పెద్ద పేగులో కనిపించే అతి పెద్ద విపత్తు క్యాన్సర్‌. ఈ వ్యాధితో ఏటా వేలాది మంది చనిపోతున్నారు. ఇంకా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) అంచనా ప్రకారం కొలొరెక్టల్ క్యాన్సర్ కేసులు 2020 నుంచి 2040 మధ్యలో 56% పెరిగే అవకాశం ఉంది.

అలాగే సంవత్సరానికి 3 మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని IARC స్పష్టం చేసింది. 2040లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.6 మిలియన్ల మంది మరణాలుకు ఈ క్యాన్సర్‌ కారణం అవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కేసులు ఎక్కువగా మానవాభివృద్ధి సూచిక ఎక్కువగా ఉన్న దేశాలలో ఉంటుందని అంచనా. అందుకే ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుని.. నివారించడం చాలా మేలు.  మరి పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలేమిటో.. అది ఎవరికీ ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పెద్దపేగు క్యాన్సర్‌ లక్షణాలివే..

పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నవారికి కనిపించే ప్రధాన లక్షణం మలద్వారం నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కొద్దిరోజులు విపరీతమైన మలబద్దకంగా ఉంటుంది, మరికొన్ని రోజులు విరేచనాలు అవుతూ ఉంటాయి. మలం వదులుగా అవుతూ ఉంటుంది. పొట్ట కింది నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పురీషనాళం నుంచి లేత ఎరుపు రక్తస్రావం, రక్తం కారణంగా మలం ముదురు రంగులో ఉంటాయి. మల విసర్జన చేస్తున్నప్పుడు నొప్పిగా అనిపించడం. బలహీనత, అలసట, అకారణంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు. తొలి దశలో ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తే.. మహమ్మారిపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వీరికే పెద్దపేగు క్యాన్సర్‌ రిస్క్ ఎక్కువ:

  • వయస్సు మీద పడినవారికి.. పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.
  • కొందరిలో పేగుల్లో వాపు, నొప్పి, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ వంటి సమస్యలు ఉన్నవారి సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. ఈ క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్‌ కాదు. కానీ మీ కుటుంబంలో ఈ క్యాన్సర్‌ వచ్చిన వారు ఉంటే.. కొంచెం జాగ్రత్తగా ఉండి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి.
  • అధిక బరువు, పీచు పదార్థాలు లేని జంక్‌ఫుడ్ తినడం, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువ అవుతుంది.
  • డయాబెటిస్ ఉన్నవారిలోనూ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి