AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ear Buds: ఇయర్ ఫోన్స్ అతిగా వాడుతున్నారా.? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.! తస్మాత్ జాగ్రత్త..

రెగ్యులర్‌గా ఇయర్‌ ఫోన్స్‌, ఇయర్‌ పాడ్స్‌ వాడుతూ ఉంటారా? ఇంట్లో టీవీ వాల్యూమ్‌ హై-పెడితేగాని వినిపించడం లేదా..?

Ear Buds: ఇయర్ ఫోన్స్ అతిగా వాడుతున్నారా.? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.! తస్మాత్ జాగ్రత్త..
Ear Buds Using
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2023 | 10:09 AM

Share

రెగ్యులర్‌గా ఇయర్‌ ఫోన్స్‌, ఇయర్‌ పాడ్స్‌ వాడుతూ ఉంటారా? ఇంట్లో టీవీ వాల్యూమ్‌ హై-పెడితేగాని వినిపించడం లేదా? ఫోన్‌లో ఎదుటివారు గట్టిగా మాట్లాడుతున్నా వినిపించడం లేదా? అయితే తప్పకుండా మీకు వినికిడి సమస్యలు ఉన్నట్టే. సమస్య మరింత తీవ్రం కాకముందే నిపుణులను కలవండి.

వినికిడి లోపాలు – లైఫ్‌స్టైల్‌ తీసుకొస్తున్న కొత్త సమస్య. మ్యూజిక్‌ వినేందుకు, ఫోన్‌లో మాట్లాడేందుకు లేదా స్టైల్‌ ప్రదర్శించేందుకు వాడుతున్న ఇయర్‌ ఫోన్స్, ఇయర్‌ పాడ్స్‌ చెవులను కుళ్లబొడుస్తూ వినికిడి సమస్యలకు కారణమవుతున్నాయి. జూమ్‌ మీటింగ్స్ కావచ్చు, బయటి నుంచి వచ్చే శబ్దాలు రాకుండా చూసేందుకు కావచ్చు, నచ్చిన మ్యూజిక్‌ వినడం కావచ్చు లేదా మొబైల్స్‌లో గేమ్స్‌ ఆడటం, టీవీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌ చూడటం కావచ్చు, జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేసే సమయంలో కావచ్చు, రోడ్డు మీద వెళ్తున్ననప్పుడు కావచ్చు, – ఈ మధ్య కాలంలో ఇయర్‌ ఫోన్స్, ఇయర్ పాడ్స్‌ వాడటం సర్వసాధారణం అయిపోయింది. వెహికల్స్‌పై వెళ్తున్నప్పుడు, మార్నింగ్‌ వాకింగ్‌ చేస్తున్నప్పుడు చెవులకు ఇయర్‌ ఫోన్స్‌ ధరించడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది.

కొందరికి ఇవి ఒంట్లో భాగంగా మారిపోయాయి కూడా. అవి చెవులకు లేకపోతే ఏదో కోల్పోయామనే భావన చాలా మందికి ఉంటుంది. చెవులకు దగ్గరగా పెట్టుకొని శబ్దాలు వినడం వల్ల కర్ణభేరిపై ఒత్తిడి పెరిగి వినికిడి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇవే కాదు ఇతర ఆరోగ్య సమస్యలకూ ఇవి కారణమవుతున్నాయి. కొత్తగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ రీసెర్స్‌ సంస్థ లోతుగా అధ్యయనం చేసింది. యువతలో ఏర్పడుతున్న వినికిడి సమస్యలకు ప్రధాన కారణం ఇయర్‌ ఫోన్స్‌ విపరీతంగా వాడకమని గుర్తించింది. వీటిని ఎంత విపరీతంగా ఉపయోగిస్తే సమస్య అతి ప్రమాదకరమని నిర్థారించారు.

వాస్తవానికి 50 సంవత్సరాల తర్వాత సాధారణంగా వినికిడి సమస్యలు వస్తూ ఉంటాయి. కాని ఇప్పుడు 20 ఏళ్ల వారిలోనూ ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం చిన్న వయస్సు నుంచే వారు శబ్ధానికి విపరీతంగా ఎక్స్‌పోజ్‌ కావడం అని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటివరకు ప్రతీ 10 మందిలో ఒకరికి వినికిడి సమస్యలున్నాయి. అది కూడా పెద్ద వయస్సు వారిలోనే ఆ సమస్యలు కనిపిస్తున్నాయి. కాని, ఈ ఇయర్‌ ఫోన్స్‌ వచ్చిన తర్వాత ఈ సంఖ్య పెరిగిపోతోంది. రానున్న రోజుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి వినికిడి సమస్యలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది కూడా యువతలో ఈ సమస్యలు తీవ్రంగా చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెవుల్లో ఏదో శబ్ధాలు వినిపిస్తూ ఉండటం, ఏదో రొద పెడుతున్నట్టుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని వినికిడి సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పడానికి తొలి సంకేతంగా చెప్పవచ్చు. కొత్తగా వస్తున్న హైటెక్‌ ఇయర్‌ ఫోన్స్‌, బడ్స్‌తో కొంత మెరుగ్గా ఉన్నా ప్రమాదం లేదని చెప్పలేమని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది యువకులు, పెద్ద వయస్సు వారిలో వినికిడి సమస్యలు తలెత్తవచ్చని అంచనా వేస్తున్నారు. అంతే కాదు ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 43 కోట్ల మంది చెవిటితనంతో బాధపడుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఇండియాలో దాదాపు 60 లక్షల మందికి వినికిడి సమస్యలు ఉన్నాయని గుర్తించారు. ఇయర్‌ ఫోన్స్‌ విపరీతంగా వాడే అలవాటు ఉంటే జాగ్రత్తపడండి. అరగంట సేపు వాటిని ఉపయోగించారంటే ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మీ చెవులకు విరామం ఇవ్వండి.