OnePlus 100W Charger: సూపర్ చార్జర్‌ను తీసుకొస్తున్న వన్‌ప్లస్.. కేవలం 10 నిముషాలు చార్జింగ్ పెడితే చాలు.. ప్రోడక్ పూర్తి వివరాలివే..
100W సామర్థ్యం కలిగిన డ్యూయల్ పోర్ట్ ఛార్జర్‌ను వన్‌ప్లస్ కంపెనీ విడుదల చేయనుంది. OnePlus కంపెనీ కొద్ది రోజులుగా మొబైల్ ఫోన్లపై
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి మరి త్వరలో మరో కొత్త ప్రొడక్ట్ మార్కెట్‌లోకి రానుంది. అదేమిటంటే.. 100W సామర్థ్యం కలిగిన డ్యూయల్ పోర్ట్ ఛార్జింగ్ అడాప్టర్‌ను వన్‌ప్లస్ కంపెనీ విడుదల చేయనుంది. OnePlus కంపెనీ కొద్ది రోజులుగా మొబైల్ ఫోన్లపై కాకుండా ఇతర యాక్ససరీస్లపై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ వన్‌ప్లస్ సంస్థ టీడబ్ల్యూఎస్(ట్రూ వైర్లెస్ స్టీరియో) ఇయర్ బర్డ్స్, కొత్త మానిటర్లు, టీవీలు తదితర కొత్త పరికరాలను ఆవిష్కరించింది. ఈ క్రమంలోనే ఈ సంస్థ నుంచి ఇప్పుడు 100 వాట్ సామర్థ్యం కలిగిన ఛార్జింగ్ అడాప్టర్ కూడా రానుంది. అయితే ఇలాంటి ప్రొడక్ట్‌ను విడుదల చేయడం ఇదే మొదటి సారి అని సంస్థ పేర్కొంది. ఒక ఈ కొత్త ఛార్జింగ్ అడాప్టర్ ఫీచర్ల గురించి చెప్పుకోవాలంటే..
OnePlus 100W చార్జర్ ఫీచర్లు: ఈ వన్‌ప్లస్ 100W సామర్థ్యం కలిగిన ఛార్జింగ్ అడాప్టర్ డ్యూయల్ పోర్ట్ సూపర్ ఫ్లస్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. అంటే ఈ ఛార్జింగ్ అడాప్టర్‌లో రెండు పోర్టులుంటాయి. అందులో ఒకటి యూఎస్బీ-ఏ కాగా, మరొకటి టైప్ పీ పోర్టు. ఇంకా ఈ రెండింటినీ ఒకే సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఈ ఛార్జర్ 65W పీడీ(పవర్ డెలివరీ) సామర్థ్యం కలిగి ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ వన్‌ప్లస్ డ్యూయల్ పోర్ట్ ఛార్జర్‌ను.. మార్కెట్లలో ఉన్న వాటిలా కాకుండా భిన్నంగా ఉంటుంది. ఎలా అంటే దీనిని స్మార్ట్‌ఫోన్, టీడబ్య్లూఎస్, ల్యాప్‌టాప్‌లకు కూడా ఉపయోగించవచ్చు. ఇంకా వన్‌ప్లస్ కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం ఈ ఛార్జర్‌తో 25 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే కేవలం 10 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుంది. కాగా, తొలుత చైనాలో ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయబోతున్నట్టు సంస్థ ప్రకటించింది. మరోవైపు ఈ వన్‌ప్లస్ డ్యూయల్ పోర్ట్ ఛార్జర్ ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలోకి ఎప్పుడు రానుందో తెలియరాలేదు. అయితే త్వరలో ఈ అంశంపై స్పష్టత రానుందని వన్‌ప్లస్ కంపెనీ వర్గాలు తెలిపాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..