AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Buying Tips: కొత్త కారు కొనాలని చూస్తున్నారా..? ఈ విషయాలను గుర్తుపెట్టుకోకపోతే.. పూర్తిగా మోసపోవడం ఖాయం..!

ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో వాహనాల ధరలు బాగా మండిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే పలు కంపెనీలు తమ కొత్త కస్టమర్లను రకరకాల పేర్లతో మోసం..

Car Buying Tips: కొత్త కారు కొనాలని చూస్తున్నారా..? ఈ విషయాలను గుర్తుపెట్టుకోకపోతే.. పూర్తిగా మోసపోవడం ఖాయం..!
Car Buying Tips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 05, 2023 | 9:20 AM

Share

ప్రస్తుత కాలంలో కాస్ట్ ఆఫ్ లీవింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగానే మన అవసరాలు కూడా పెరిగాయి. ఆ క్రమంలో కార్ అనేది ఉండడం తప్పనిసరి పరిస్థితిగా మారింది. అయితే ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో వాహనాల ధరలు బాగా మండిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే పలు కంపెనీలు తమ కొత్త కస్టమర్లను రకరకాల పేర్లతో మోసం చేస్తున్నాయి. అందువల్ల మీరు కొత్త కారు కొనేటప్పుడు కొన్ని విషయాలని తప్పక గుర్తుంచుకోవాలి. అప్పుడే ఎటువంటి మోసాలకి గురికాకుండా ఇంకా సాధ్యమైనంతగా మీ డబ్బును కూడా ఆదా చేయవచ్చు. మరి అవేమిటో.. అవి మీకు ఏ విధంగా ఉపయోగపడాతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కారు ఇన్సూరెన్స్: కారు ఎక్స్-షోరూమ్ ధర, ఆన్-రోడ్ ధర రెండూ వేర్వేరుగా ఉంటాయి. వెహికిల్ ఆన్-రోడ్ ధరలోనే కొత్త కారు ఇన్సూరెన్స్ కూడా కలిసి ఉంటుంది. అందువల్ల షోరూమ్ నుంచి కారును కొనుగోలు చేసినప్పుడు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే డబ్బును ఆదా చేయడానికి ఇన్సూరెన్స్‌ని బయటి నుంచి కొనుగోలు చేయడం ఉత్తమం. ఆ క్రమంలోనే వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల ఆఫర్‌లను చెక్ చేయండి. అలా మంచి డీల్‌ను ఎంపిక చేసుకోండి. ఇన్సూరెన్స్‌ షోరూమ్‌ కంటే బయటతీసుకుంటే తక్కువగా ఉంటుంది.

కారు ఆక్సెసరీస్‌: కారు కొనుగోలు చేసేటప్పుడు కారు డెకరేషన్‌కి సంబంధించిన చాలా వస్తువులని షోరూమ్ నుంచే కొనుగోలు చేస్తారు. రెయిన్ విజర్‌లు, సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్‌లు మొదలైనవాటిని అడిగి మరీ కొంటారు. అయితే షోరూమ్ నుంచి యాక్సెసరీలు కొనుగోలు చేయడం చాలా ఖరీదైనదిగా ఉంటుంది. అందువల్ల కారు కొనుగోలు చేసిన తర్వాత మీకు నచ్చిన వస్తువులని బయటి నుంచి కొనుగోలు చేయడం వల్ల కొంత డబ్బు ఆదా చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

కారు లోన్: చాలా మంది కొత్త కారు కొనడానికి బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. అయితే లోన్‌ తీసుకునే ముందు కొన్ని విషయాలపై దృష్టిపెట్టాలి. మీరు వివిధ బ్యాంకుల ఆఫర్‌లు,, వడ్డీరేట్లని తనిఖీ చేయాలి. అతి తక్కువ వడ్డీ రేటు ఏ బ్యాంకు అందిస్తోందో చూడాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మీరు గరిష్టంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్