AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expired Tablets: మీ దగ్గరున్న కాలం చెల్లిన ట్యాబ్లెట్స్‌ను బయటపడేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

మీరు అనారోగ్యానికి గురైన సమయంలో వాడగా మిగిలిపోయిన, కాలం చెల్లిన(ఎక్స్‌పైర్ అయిన) ట్యాబ్‌లెట్స్‌ను ఇంట్లో, ఇంటిబయట, ఎక్కడపడితే అక్కడ పాడేస్తున్నారా..అయితే ఇకపై అలా చేయొద్దు. ఎందుకంటే అలా ఆరుబయట పడేసిన ట్యాబ్లెట్స్‌ ప్రజలు, జంతువులకు హానికరంగా మారే ప్రమాదం ఉందని ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు. మీరు వాడిన తర్వాత కూడా ట్యాబెల్స్‌ మిగిలి ఉంటే వాటిని కవర్‌లోంచి తీసి ఇంట్లోని టాయిలెట్‌ వేసి ఫ్లష్ చేయాలని సూచిస్తున్నారు.

Expired Tablets: మీ దగ్గరున్న కాలం చెల్లిన ట్యాబ్లెట్స్‌ను బయటపడేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
Expired Medicines
Anand T
|

Updated on: Jul 09, 2025 | 10:59 AM

Share

మనం అనారోగ్య సమస్యల నుంచి బటయపడేందుకు ఉపయోగించే కొన్ని ఔషదాలు కొన్ని సార్లు మనతో పాటు జంతువుల ప్రాణాలకు కూడా ప్రమాదాకరంగా మారవచ్చ. ఇది మేం చెబుతున్న విషయం కాదు. మనం నారోగ్యానికి గురైన సమయంలో వాడగా మిగిలిన, గడువు ముగిసినా ట్యాబ్లెట్స్‌ను ఇంటిబయట ఎక్కపడితే అక్క పారేయడం కారణంగా.. అవి చిన్న పిల్లలు, పశువులకు ప్రమాదకరంగా మారుతున్నాయని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అధికారులు చెబుతున్నారు. మనం ఇంటి పరిసరాల్లో పడేసిన కాలం చెల్లిన ట్యాబ్లెట్స్‌ను చిన్నారులు కానీ, పెంపుడు జంతువులు కానీ తినడం కారణంగా.. అవి అనారోగ్యానికి గురవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీటిపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు అధికారులు కొన్ని సూచనలు చేశారు.

బయటపడేయకూడని కాల్లం చెల్లిన ట్యాబ్లెట్స్‌ ఇవే..

మనం ఉపయోగించే హానికరమైన కొన్ని ఔషదాలను పద్దతి ప్రకారమే పడేయాలని వారు చెబుతున్నారు. ఈ మేరకు కాలం చెల్లిన తర్వాత బయట పడేయకూడని 17 రకాల ఔషదాల జాబితాను అధికారులు విడుదల చేశారు. వీటిలో ముఖ్యంగా మనం తీవ్ర నొప్పి కోసం వాడే ట్రామాడోల్, టాపెంటాడోల్, డయాజెపామ్, ఆక్సికోడోన్, ఫెంటానిల్‌, మార్ఫిన్ సల్ఫేట్, మెథడోన్ హైడ్రోక్లోరైడ్, హైడ్రోమోర్ఫోన్ హైడ్రోక్లోరైడ్, హైడ్రోకోడోన్ బిటార్ట్రేట్ ,టాపెంటాడోల్, ఆక్సికోడోన్ హైడ్రోక్లోరైడ్ ,ఆక్సికోడోన్, ఆక్సిమోర్ఫోన్ హైడ్రోక్లోరైడ్, సోడియం ఆక్సిబేట్, ట్రామాడోల్, మిథైల్ఫెనిడేట్, మెపెరిడిన్ హైడ్రోక్లోరైడ్ వంటి ఉన్నాయి.

పైన సూచించిన ఈ కాలం చెల్లిన, అవసరం లేని ఈ ట్యాబ్లెట్స్‌ కనుక మీ దగ్గర ఉంటే, వాటిని కవర్‌ల నుంచి తొలగించి, ఆ తర్వాత ఇంట్లోని టాయిలెట్‌లో వేసి ఫ్లష్ చేయమని సీడీఎస్‌సీవో సూచించింది. ఎందుకంటే వాటిని దుర్వినియోగం చేస్తే చాలా ప్రమాదాలు సంభవించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ జాబితాలోని ఔషధాలు ఎక్కువగా వ్యసనపరుడైన, దుర్వినియోగానికి గురయ్యే మాదకద్రవ్యాలు ఉన్నందున వాటిని నిషేధించాలని ప్రభుత్వం సిఫార్సు చేసిందని మాక్స్ హెల్త్‌కేర్ డైరెక్టర్ దేవరతి మజుందార్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.