kidney health : ఈ అలవాట్లు మానుకుంటే మీ కిడ్నీలు సేఫ్…లేకపోతే కోట్లు ఖర్చు చేసిన కిడ్నీలు దొరకవు..
జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులను నివారించడమే కాకుండా వ్యాధి ప్రారంభ దశలోనే నియంత్రణ కూడా సాధ్యమవుతుంది.

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులను నివారించడమే కాకుండా వ్యాధి ప్రారంభ దశలోనే నియంత్రణ కూడా సాధ్యమవుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మొత్తం ఐదు దశల్లో వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కానీ మొదటి రెండవ దశల్లో వ్యాధిని పూర్తిగా అధిగమించడం సాధ్యమవుతుంది. ఇందుకోసం ముందుగా రోగుల్లో అవగాహన కల్పించడం ముఖ్యం. నేడు, మూత్రపిండాల వ్యాధులను నియంత్రించడానికి, వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం.
భారతదేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటా శరవేగంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, అల్లోపతితో పాటు, ఆయుర్వేదం మందులు కూడా కిడ్నీ రోగులను కోలుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిలో పునర్నవ, గోఖ్రు, వరుణ్, కస్ని, మాకోయ్, పలాష్. గిలోయ్ మొదలైన మూలికలు మీ కిడ్నీలను కాపాడుతాయి.
న్యూఢిల్లీలోని జామియా హమ్‌దార్డ్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పరిశోధకులు జన్యు ప్రవర్తనలో మార్పులు కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయని ఒక అధ్యయనంలో పేర్కొన్నారు. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 20-25 మధ్య ఉంచుకోవడం, వారానికి ఐదు రోజులు రోజూ 30 నిమిషాలు నడవడం, పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వంటి ఆహార శైలిని మార్చుకోవడం ద్వారా కిడ్ని వ్యాధుల నుంచి బయట పడొచ్చు.అంతేకాదు కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండాలంటే మద్యపానం నుంచి పూర్తిగా దూరం అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధ్యలో ఉండే ఆల్కహాల్ మీకు కిడ్నీలపై భారం పెంచి ఇన్ఫెక్షన్ గురవేలా చేస్తాయి. అలాగే డయాబెటిస్ ను కూడా కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చు లేకపోతే కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.




పెయిన్ కిల్లర్లు వాడకం మానేయడం. మూడు లీటర్ల నీరు తీసుకోవడం, ధూమపానం మానేయడం మొదలైనవి కిడ్నీ వ్యాధిని ప్రాథమిక దశలో నియంత్రించేందుకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు కిడ్నీ వ్యాధిగ్రస్తులు పుష్కలంగా మంచినీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ఉదాహరణకు అరటి పండ్లు క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిది. పండ్లలో పుచ్చకాయ, నారింజ, దానిమ్మ బత్తాయి, వంటి పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది.
అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా శరీరంలో క్రియాటిన్ పెరగడం వల్లే ఫెయిల్యూర్ కు దారితీస్తూ ఉంటుంది అందుకే రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ ద్వారా క్రియాటిన్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం అనే చెప్పాలి. తద్వారా నీ కిడ్నీలు ఎంత మేర ఆరోగ్యంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
అలాగే వేసవికాలంలో కొబ్బరి బోండాలు తాగితే మంచిది తద్వారా కిడ్నీలు చక్కగా పనిచేస్తాయి. ఇక ఆహారంలో మాంసాహారం విషయంలో చాలా లిమిట్ గా ఉంటే మంచిది ఒకసారి కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యాయి అంటే మాంసాహారం దాదాపు మానేస్తే మంచిది ఎందుకంటే మాంసాహారంలోని ప్రోటీన్లు కిడ్నీపై భారం పెంచుతాయి తద్వారా మీ కిడ్నీ మరింత ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం ఉంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం



