AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కొత్తిమీరను తినకుండా వదిలేస్తున్నారా..? అయితే మీరు ఈ విషయాలను తప్పక తెలుసుకోవలసిందే..

వంట గదిలో కనిపించే ప్రతి పదార్థం ద్వారా మనకు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి. అలా వంటగదిలో ఎక్కువగా కనిపించే వాటిలో కొత్తిమీర కూడా ఒకటి. ఈ కొత్తిమీర ఆహారం రుచిని రెట్టింపు చేయడమే కాక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అందుకే భారతీయులు..

Health Tips: కొత్తిమీరను తినకుండా వదిలేస్తున్నారా..? అయితే మీరు ఈ విషయాలను తప్పక తెలుసుకోవలసిందే..
Coriander
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 29, 2023 | 9:41 PM

Share

వంట గదిలో కనిపించే ప్రతి పదార్థం ద్వారా మనకు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి. అలా వంటగదిలో ఎక్కువగా కనిపించే వాటిలో కొత్తిమీర కూడా ఒకటి. ఈ కొత్తిమీర ఆహారం రుచిని రెట్టింపు చేయడమే కాక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అందుకే భారతీయులు ఏ కూర చేసినా కచ్చితంగా కొత్తిమీరను ఉపయోగిస్తారు. అయితే కూరల్లో కొత్తిమీరను యాడ్ చేసినప్పటికీ చాలామంది కరివేపాకు తీసేసినట్టే కొత్తిమీరను కూడా తీసి పక్కకు పారేస్తూ ఉంటారు. కొత్తిమీరను తినడానికి చాలామంది ఇష్టపడరు.

కాగా కొత్తిమీరను వివిధ రకాల కూరలు, లేదా చట్నీ చేసుకుని తింటే మంచి రుచితోపాటు, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సుగుణాలు విటమిన్‌ ఏ, సి, క్యాల్షియం, మెగ్నీషియమ్‌లు శరీరానికి అందుతాయి. కొత్తిమీరలోని యాంటీ బయోటిక్‌ మూలకాలు రక్తంలోని చెక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ కారణంగానే కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపున తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొత్తిమీర రసంలో కొంచెం చక్కెర, నీరు కలిపి ఖాళీ కడుపుతో పరగడుపున వారం రోజులపాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో నీరసం, నిస్సత్తువలు తగ్గుతాయంట.

లినోలిక్, ఒలిక్, పాలిమిటిక్, స్టియారిక్, ఆస్కార్బిక్‌ యాసిడ్స్‌ వంటివి కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధ సమస్యలు, హార్ట్‌ స్ట్రోక్‌ల వంటి హృదయ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి. ప్రతి రోజు కొత్తిమీర తినడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. లినోలాల్‌ అనే మూలకం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషించి, జీర్ణసమస్యలను దరిచేరనివ్వదు. అంతే కాకుండా కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది. తరచు కొత్తిమీర చట్నీ తింటు ఉండటం వల్ల లేదా ధనియాల పొడిలో కొద్దిగా తేనె వేసుకుని తీసుకుంటుండటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది. కొత్తిమీర డైయూరిటిక్‌గా పనిచేస్తుంది. శరీరంలో సోడియంను బయటకు పంపి రక్తపోటును తగ్గించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్‌ఐని కూడా తగ్గిస్తుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల ఇకపై కొత్తిమీరను తినే ముందు తీసేయకుండా తినండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…