AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిళ్లు లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా ? అయితే జాగ్రత్తగా ఈ వ్యాధుల ప్రభావం ఎక్కువట.. అధ్యాయనంలో షాకింగ్ విషయాలు..

రాత్రిపూట లైట్స్ వేసుకుని పడుకునేవారిలో ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యలు అధికంగా ఉంటుందని వెలువడింది..

రాత్రిళ్లు లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా ? అయితే జాగ్రత్తగా ఈ వ్యాధుల ప్రభావం ఎక్కువట.. అధ్యాయనంలో షాకింగ్ విషయాలు..
Sleeping
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2022 | 9:26 AM

Share

సాధారణంగా చాలా మందికి రాత్రిళ్లు లైట్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది.. కానీ 63 నుంచి 84 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు ఎక్కువగా నిద్రపోతున్నప్పుడు లైట్స్ వేసుకుంటారు..కానీ తాజా నివేదికల ప్రకారం వారిలో అధిక శాతం ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలను కలిగి ఉన్నారట.. రాత్రి సమయంలో ఎటువంటి కాంతికి గురికానీ వారికంటే లైట్స్ వేసుకునే వారిలో ఆ సమస్యలు అధికంగా ఉన్నాయని నివేదికలు చెబుుతన్నాయి..

జూన్ 22న ఓ పత్రికలో ప్రచురించబడిన నివేదికలో రాత్రిపూట లైట్స్ వేసుకుని పడుకునేవారిలో ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యలు అధికంగా ఉంటుందని వెలువడింది.. ఒకరి స్మార్ట్ ఫోన్ లేదా రాత్రిళ్లు టీవీ లైట్స్ వంటి కాంతిలో 24 గంటలు ఉంటున్నామని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫీన్ బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ ఫిజిషియన్ అధ్యయన సంబంధిత రచయిత డా.మింజీ కిమ్ అన్నారు.. వృద్ధులలో ఇప్పటికే మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉందని.. కాబట్టి వారు రాత్రిళ్లు ఎక్కువగా కాంతికి గురయినప్పుడు అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయన్నారు.. ఇటీవల జరిగిన ఓ అధ్యాయనంలో 552 మందిలో సగం కంటే తక్కువ మంది రోజుకు ఐదు గంటలు పూర్తి చీకటిని కలిగి ఉన్నారని అధ్యయన పరిశోధకులు తెలిపారు..

ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారు లైట్స్ వేసుకుని నిద్రపోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వీరు చీకటిలో కంటే కాంతి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండడడం ప్రధాన కారణం.. మధుమేహం కారణంగా పాదాల తిమ్మిరి ఉన్నవారు పడిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి రాత్రిపూట కాంతిని ఉంచుకోవాలనుకోవచ్చు. వీరు రాత్రిళ్లు లైట్స్ ఆఫ్ చేయడం మరింత ముఖ్యం అన్నారు నిపుణులు..

ఇవి కూడా చదవండి

నిద్రలో కాంతిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చిట్కాలు.. లైట్స్ వేయకూడదు.. బదులుగా డిమ్ లైట్ వేసుకోవడం మంచిది.. రంగు ముఖ్యం.. అంబర్ లేదా ఎరుపు, నారింజ రంగు కాంతి మెదడుకు తక్కువ ఉత్తేజాన్ని కలిగిస్తుంది.. తెలుపు, నీలం కాంతిని ఉపయోగించవద్దు. అవుట్‌డోర్ లైట్‌ని కంట్రోల్ చేయలేకపోతే బ్లాక్అవుట్ షేడ్స్ లేదా ఐ మాస్క్‌లు మంచివి.

Note: ఈ కథనం కేవలం నిపుణులు, అధ్యాయనాల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. సందేహాలకు వైద్యుల సలహాలు తీసుకోవాలి..