Health: మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా.. అయితే అనారోగ్యాన్ని దాచుకుంటున్నట్లే.. ఎంత ప్రమాదం అంటే..

Health: మనిషి జీవన క్రియలో మూత్ర విసర్జన ఒకటి. శరీరంలో పేరుకుపోయిన వ్యార్థాలను కిడ్నీలు ఫిల్టర్‌ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతుంటాయి. అందుకే బాగా నీరు తాగుతూ, మూత్ర విసర్జన..

Health: మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా.. అయితే అనారోగ్యాన్ని దాచుకుంటున్నట్లే.. ఎంత ప్రమాదం అంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 28, 2021 | 1:20 PM

Health: మనిషి జీవన క్రియలో మూత్ర విసర్జన ఒకటి. శరీరంలో పేరుకుపోయిన వ్యార్థాలను కిడ్నీలు ఫిల్టర్‌ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతుంటాయి. అందుకే బాగా నీరు తాగుతూ, మూత్ర విసర్జన క్లియర్‌గా ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవని నిపుణులు చెబుతుంటారు. అయితే మారుతోన్న జీవన విధానం, ఉద్యోగ శైలి, అందుబాటులో వాష్‌ రూమ్స్‌ లేకపోవడంతో మూత్ర విసర్జన కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా మారుతుంటుంది. ఇక వాష్‌ రూమ్‌ దూరంగా ఉంది తర్వాత వెళ్దాంలే అనుకుంటూ కొందరు ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుంటుంటారు.

మీరు కూడా ఇలానే చేస్తున్నారా.? అయితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లే అని చెబుతున్నారు నిపుణులు. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే.. అనారోగ్యాలను మీ శరీరంలో దాచుకున్నట్లే అని చెబుతున్నారు. ఇంతకీ మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మూత్ర విసర్జనలో మూత్రాశయం కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే మూత్రాశయంపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీంతో మూత్రాశయంలో ఉండే కండరాలు బలహీనంగా మారుతాయి. దీంతో దీర్ఘకాలంలో తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

* మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడిపడే మరో అవయవం కిడ్నీలు. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

* మూత్రం అంటేనే శరీరంలో పేరుకు పోయిన వ్యర్థాల సమాహారం అలాంటి మూత్రాన్ని విసర్జించకుండా శరీరంలోనే ఉంచుకుంటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూత్రాన్ని ఆపుకుంటే శరీరంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వ‌ల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అంతేకాకుండా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కూడా సోకే ప్రమాదం ఉంటుంది.

* మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు తయారయ్యే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మూత్ర విసర్జన చేస్తే అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

* ఇక వైద్యుల సూచన మేరకు కనీసం 2 గంటలకు ఒకసారైనా మూత్ర విసర్జన చేస్తే మంచిదంటా.

Also Read: Almonds: వర్షాకాలంలో వ్యాధినిరోదక శక్తిని పెంచుకునేందుకు బాదంను ఇలా తినండి..

Health Benefits: పెరుగు, దానిమ్మ, పాలకుర, నిమ్మ, బిట్‌రూట్ ప్రతి రోజూ తిన్నారంటే..!

Vitamin D Deficiency: మీలో విటమిన్ డి లోపం ఉంటే మీ నాలుక గుర్తిస్తుంది.. ఎలానో తెలుసా..