Health Benefits: పెరుగు, దానిమ్మ, పాలకుర, నిమ్మ, బిట్‌రూట్ ప్రతి రోజూ తిన్నారంటే..!
Health Benefits: పసుపుపాలు, పెరుగు, దానిమ్మ, పాలకుర, బిట్‌రూట్ ప్రతి రోజూ తిన్నారంటే..!మన చర్మంఆరోగ్యంగా, తాజాగా ఉండేందుకు ఎన్నో చిట్కాలను..
Health Benefits: మన చర్మంఆరోగ్యంగా, తాజాగా ఉండేందుకు ఎన్నో చిట్కాలను పాటిస్తుంటాము. మీ రోజువారీ ఆహార అలవాట్లతో చర్మం సహజంగా కాంతివంతంగా మెరిసిపోవాలంటే చిన్నపాటి మార్పులు చేసుకోవడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనం తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే ఎంతో మేలంటున్నారు. ఇప్పుడున్న కాలంలో తినే ఆహారపు అలవాట్ల వల్ల చర్మం ముడతలు పడటం, చర్మం పేలిపోయినట్లు కావడం జరుగుతుంటుంది. ఎండవేడి వల్ల కూడా చర్మం త్వరగా పాడైపోతుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుకునేందుకు రకరకాల క్రిములను వాడుతుంటాము. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొన్నింటిని తినడం వల్ల చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పసుపు పాలు:
పసుపు పాలు కూడా ఎంతోగానో ఉపయోగపడతాయి. ప్రాచీనకాలం నుంచే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఇది ఆచరణలో ఉంది. వంటింట్లో ఎప్పుడు ఉండో పసుపులో ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయి. పసుపుకలిపిన పాలు ప్రతిరోజూ తాగడం వల్ల ముఖంపై పేరుకుపోయిన సన్‌టాన్ తొలగిపోయి చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.
పెరుగు:
పెరుగు శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలకు పెరుగు మంచి ఔషధంలా పనిచేస్తుంది. దీనిలో లాక్టిక్ ఆమ్లం, జింక్, విటమిన్ ‘బి’, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ప్రతి రోజూ ఒక కప్పు పెరుగు ఆహారంలో భాగంగా తీసుకుంటే మీ చర్మ కాంతివంతంగా మెరిసిపోతుంది.
నిమ్మ :
నిమ్మలో సి, బి విటమిన్లు, పాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. సహజమైన చర్మకాంతికి ఇది చక్కని పోషకంగా చెప్పవచ్చు. నిమ్మలోని సహజ ఆమ్లాలు మృతకణాలను తొలగిస్తుంది. వయసు పెరిగేకొద్ది చర్మంపై ఏర్పడే ముడతలను నివారిస్తుంది.
పాలకూర:
పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మంపై మచ్చలను తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. పాలకూరలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చూస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.
దానిమ్మగింజలు:
దానిమ్మపండు గింజలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వృద్ధాప్య ఛాయల నుంచి రక్షణ కల్పిస్తాయి. సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మానికి మంచి ఔషధంగా ఉపయోగడపతాయి. దానిమ్మను జ్యూస్ రూపంలో తాగొచ్చు లేదా గింజలను నేరుగా తిన్నా ఫలితం ఉంటుంది.
బీట్ రూట్:
బీట్‌రూట్ ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మొత్తంలో లభిస్తాయి. మృతకణాల స్థానంలో కొత్తవి నిలపడంలో, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటంలో, పిగ్మెంటేషన్ తొలగింపులో బీట్‌రూట్ జ్యూస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని శుభ్రపరచడం, శరీరంలో రక్త ప్రవాహాన్ని ఉత్తేజపరచి, చర్మం మెరిసేలా చేస్తుంది. శరీరంలో హానికారక టాక్సిన్స్‌ను తొలగించి మీ ముఖం మీద ఆరోగ్యకరమైన కాంతి ఉండేలా పని చేస్తుంది.