Almonds: వర్షాకాలంలో వ్యాధినిరోదక శక్తిని పెంచుకునేందుకు బాదంను ఇలా తినండి..

కోవిడ్‌కు చెక్ పెట్టిన మనం ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాం. అయితే ఇలాంటి సమంయలో మనకు మరింత ఆరోగ్యాన్ని అందించేందుకు పౌష్టిక ఆహారం చాాలా అవసరం.

Almonds: వర్షాకాలంలో వ్యాధినిరోదక శక్తిని పెంచుకునేందుకు బాదంను ఇలా తినండి..
Soaked Almonds
Follow us

|

Updated on: Sep 28, 2021 | 12:17 PM

Almonds Health Benefits: కోవిడ్‌కు చెక్ పెట్టిన మనం ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాం. అయితే ఇలాంటి సమంయలో మనకు మరింత ఆరోగ్యాన్ని అందించేందుకు పౌష్టిక ఆహారం చాాలా అవసరం. ఇలాంటి సమయంలో మనకు ఆహార పదార్ధాల్లో ఒకటిగా నిలిచింది బాదం పప్పు. ఈ బాదంపప్పును నిత్యం తినడం వల్ల మనలో కొంత వ్యాది నిరోదక శక్తి పెరుగుతుంది. ఇందు కోసం ముందుగా నానబెట్టిన బాదం తినాలి. రాత్రి సమయంలో నానబెట్టిన బాదంపప్పును మర్నాడు ఉదయం తీసుకోవాలి. ఇలా రాత్రినానబెట్టిన బాదంపప్పును తినడం ఆరోగ్యానికి మంచిది. ఇలా నానబెట్టి దాని మీద ఉన్న పై పొరను తీసివేసి తినాలి. దాని తొక్కుపై ఉన్న విషపదార్థాలను తొలగించివేస్తుందని వైద్యులు అంటున్నారు. అందులోనూ వర్షం జోరుగా కురుస్తున్న ఈ సమయంలో బాదం తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఓ సారి తెలుసుకుందాం..!

నానబెట్టిన బాదంతో ఆరోగ్య ప్రయోజనాలు 

  • రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది.
  • రోజూ నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల మెదడు పనితీరును ప్రోత్సహించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. బాదంలో అవసరమైన కొవ్వులు ఉంటాయి. ఇది మీ మెదడు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
  • నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
  • మీరు అధిక రక్తపోటును బాదంతో చికిత్స చేయవచ్చు. రోజూ నానబెట్టిన బాదంపప్పు తినడం అధిక రక్తపోటు చికిత్సకు సహాయపడుతుంది.
  • మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే, మీ రోజువారీ ఆహారంలో నానబెట్టిన బాదంపప్పును చేర్చండి. భోజనాల మధ్య బాదం నమలడం వల్ల ఆకలి మళ్లీ మళ్లీ ఆగుతుంది.
  • నానబెట్టిన బాదంలో విటమిన్ బి 17 పుష్కలంగా ఉంటుంది, ఇది వివిధ రకాల క్యాన్సర్‌తో పోరాడటానికి చాలా సహాయపడుతుంది.
  • గర్భధారణ సమయంలో నానబెట్టిన బాదం తినడం చాలా ప్రయోజనకరం. బాదంలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది బిడ్డను సులభంగా.. ఇబ్బంది లేకుండా చేస్తుంది.
  • డయాబెటిక్ రోగులకు బాదం చాలా మంచిది. రోజూ బాదం తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.
  • మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న ప్రజలందరూ ప్రతిరోజూ నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం ప్రారంభించాలి. బాదంలో కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
  • బాదం మీకు ఆకలిగా అనిపించినప్పుడు తినడానికి సరైన చిరుతిండి.
  • బాదం పప్పులో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేయడానికి సహాయపడుతుంది.
  • నానబెట్టిన బాదంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మీ శరీరం  మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. బాదం కూడా మీ చర్మం, జుట్టు కోసం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ ప్రయోజనాల కోసం మీరు మీ ఆహారంలో నానబెట్టిన బాదంపప్పును యాడ్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి:  Vitamin D Deficiency: మీలో విటమిన్ డి లోపం ఉంటే మీ నాలుక గుర్తిస్తుంది.. ఎలానో తెలుసా..

Gratuity calculation: గ్రాట్యుటీకి సంబంధించిన రూల్స్ మార్చబడ్డాయి.. మీకు ఎంత.. ఎలా పేమెంట్ పొందుతారు.. పూర్తి సమాచారాన్ని ఇక్కడ తీసుకోండి..