AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut: పచ్చి కొబ్బరితో జాగ్రత్త! ఈ సమస్యలు ఉంటే తినకపోవడమే మంచిది

కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనం నమ్ముతాం. కానీ కొన్నిసార్లు దాని వాడకం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొబ్బరిని ఎక్కువగా తింటే గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, బరువు పెరగడం లాంటివి వస్తాయి. కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలున్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. కొబ్బరిని ఎవరు తినకూడదో ఇప్పుడు చూద్దాం.

Coconut: పచ్చి కొబ్బరితో జాగ్రత్త! ఈ సమస్యలు ఉంటే తినకపోవడమే మంచిది
Coconut Side Effects
Bhavani
|

Updated on: Sep 24, 2025 | 8:03 PM

Share

కొబ్బరి అనేది మన ఆహారపు అలవాట్లలో ఒక ముఖ్యమైన భాగం. పచ్చి కొబ్బరి తినవచ్చు, కొబ్బరి నీళ్లు తాగవచ్చు, లేదా కొబ్బరి నూనెను వంటకు, శరీరానికి వాడవచ్చు. కొబ్బరిలో పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి జుట్టుకు, చర్మానికి కూడా మంచిది. కానీ కొబ్బరిలో ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎంతో ఆరోగ్యకరమైన కొబ్బరి, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఎలా హాని చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

గుండె ఆరోగ్యానికి హానికరం

ఎక్కువగా కొబ్బరి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. కొబ్బరి నూనె గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా కొబ్బరి నూనెను గుండెకు ప్రమాదకరం అని ప్రకటించింది. కొబ్బరి నూనె చెడు కొలెస్ట్రాల్ ను పెంచి గుండె జబ్బులకు దారి తీస్తుంది.

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు ఉన్నవారు కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువగా తింటే కడుపులో గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు లాంటి సమస్యలు పెరుగుతాయి.

బరువు పెరుగుతారు

ఎక్కువ బరువు ఉన్నవారు కొబ్బరి తినడం మానేయాలి. కొబ్బరిలో కేలరీలు తక్కువగా ఉన్నా, చక్కెర, నూనె ఎక్కువగా ఉంటుంది. ఇది వేగంగా బరువు పెరగడానికి దారి తీస్తుంది. కొబ్బరి ఎక్కువగా తింటే కడుపులో కొవ్వు కూడా పెరుగుతుంది. అందుకే కొబ్బరిని మితంగా తినాలి.

మధుమేహ రోగులు

షుగర్ ఉన్నవారు పచ్చి కొబ్బరి తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే మధుమేహ రోగులు దీన్ని తినకపోవడమే మంచిది.

అలెర్జీ సమస్యలు

అలెర్జీ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరి తినడం మానేయాలి. ఇది చర్మం మీద దద్దుర్లు, దురద, శ్వాస సమస్యలు, కడుపులో ఇబ్బందులు కలిగించవచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా కాదు. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే, నిపుణులైన వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం తప్పనిసరి.