Paneer Health Benefits: పన్నీర్ తో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా!
పన్నీర్ అంటే ఇష్ట పడని వారుండరు. చాలా మంది ఇష్ట పడి తింటూ ఉంటారు. పన్నీర్ తో కూరలు, స్నాక్స్, స్టాటర్స్ ఇలా ఒక్కటేంటి చాలా రకాలు చేసుకోవచ్చు. వెజిటీరియన్స్ కి ఉన్న ఆప్షన్స్ లో పన్నీర్ కూడా ఒకటి. రోడ్ సైడ్ బండి మీద నుంచి ఫైవ్ స్టార్ రెస్టారెంట్ వరకు కూడా పన్నీర్ లేకుండా మెనూ ఉండదు. అయితే పన్నీర్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదా.. కాదా అనే సందేహం ఉంటుంది. పన్నీర్ తినడం వల్ల..

పన్నీర్ అంటే ఇష్ట పడని వారుండరు. చాలా మంది ఇష్ట పడి తింటూ ఉంటారు. పన్నీర్ తో కూరలు, స్నాక్స్, స్టాటర్స్ ఇలా ఒక్కటేంటి చాలా రకాలు చేసుకోవచ్చు. వెజిటీరియన్స్ కి ఉన్న ఆప్షన్స్ లో పన్నీర్ కూడా ఒకటి. రోడ్ సైడ్ బండి మీద నుంచి ఫైవ్ స్టార్ రెస్టారెంట్ వరకు కూడా పన్నీర్ లేకుండా మెనూ ఉండదు. అయితే పన్నీర్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదా.. కాదా అనే సందేహం ఉంటుంది. పన్నీర్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
ప్రోటీన్:
పన్నీర్ ని.. పాలతో తయారు చేస్తారు కాబట్టి ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వంద గ్రాముల పన్నీర్ లో 18 గ్రాముల ప్రోటీన్ వరకూ ఉంటుంది. చికెన్ లోని.. పన్నీర్ లోని దాదాపు ప్రోటీన్ శాతం ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి పన్నీర్ తింటే రుచితో పాటు ప్రోటీన్ కూడా బాగా అందుతుంది.
కాల్షియం:
పన్నీర్ లో కాల్షియం కూడా అధిక మోతాదులోనే లభ్యమవుతుంది. ఎముకలు బలంగా, దృఢంగా ఉండటానికి కాల్షియం చాలా ముఖ్యం. కాల్షియం లోపం ఉన్న వారు, ఎముకలు బలహీనంగా ఉన్నవారు హ్యాపీగా పన్నీర్ తినడం వల్ల స్ట్రాంగ్ గా తయారవుతాయి.
వెయిట్ లాస్:
బరువు తగ్గాలి అనుకునే వారు కూడా పన్నీర్ తినొచ్చు. పన్నీర్ లో కార్బో హైడ్రేట్స్ తక్కువగా ఉండటమే కాకుండా.. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పన్నీర్ కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు హ్యాపీగా బరువు తగ్గొచ్చు. అయితే మరీ ఎక్కువ మోతాదులో కాకుండా.. తక్కువ మోతాదులో తీసుకోవాలి.
తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి:
పన్నీర్ లో జింక్ కూడా లభిస్తుంది. దీని వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అదే విధంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
కొవ్వు కరుగుతుంది:
పన్నీర్ లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. జీవ క్రియను మెరుగు పరుస్తుంది. శరీర భాగాల్లో పేరుకు పోయిన కొవ్వును కరిగించడంలో కూడా హెల్ప్ చేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.