AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెను కాపాడే ఈ సూపర్ ఫుడ్ గురించి తెలుసా

గుండెను కాపాడే ఈ సూపర్ ఫుడ్ గురించి తెలుసా

Phani CH
|

Updated on: Jan 01, 2026 | 4:45 PM

Share

బీట్‌రూట్ పోషకాల గని, సూపర్ ఫుడ్‌గా పేరుపొందింది. ఐరన్, విటమిన్ సి, ఫైబర్‌తో నిండిన ఇది గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, రక్తహీనత నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరిచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరుకు తోడ్పడటంతో పాటు అలసటను తగ్గిస్తుంది. వారానికోసారి దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.

బీట్‌రూట్.. పోషకాలు అధికంగా ఉండే ఒక దుంప.బీట్రూట్‌లో ఐరన్, పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి, ఫైబర్.. ఇలా చాలా పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్‌గా పేర్కొంటారు ఆరోగ్య నిపుణులు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుంది. అందుకే డైటీషియన్లు వారానికి ఒకసారైనా బీట్‌రూట్ తినమని సిఫార్సు చేస్తారు. రెగ్యులర్‌గా బీట్‌రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. గుండె ఆరోగ్యానికి బీట్‌రూట్ ఒక వరం లాంటిది. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. బీట్‌రూట్‌ను మీ ఆహారంలో సరైన పరిమాణంలో, సరైన మార్గంలో చేర్చుకోవడం వల్ల తీవ్రమైన, ప్రాణాంతకమైన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రక్తహీనతను ఎదుర్కోవడానికి బీట్‌రూట్ ను సిఫార్సు చేస్తారు. మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి బీట్‌రూట్ తినవచ్చు. మెదడు పనితీరు, కనెక్టివిటీని మెరుగుపరచడానికి మీ ఆహార ప్రణాళికలో బీట్‌రూట్‌ను చేర్చుకోవచ్చు. బీట్‌రూట్ కాలేయాన్ని శుద్ది చేసి, అందులోని వ్యర్థాలను వదిలిస్తుంది. అలాగే, ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్ పెడుతుంది. బీట్ రూట్‌లోని ఫైబర్.. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచి.. జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. అలసట, శారీరక బలహీనత ఉన్న వారు.. బీట్‌రూట్ తీసుకుంటే రక్తం వృద్ది అవటమే గాక జీవక్రియలు ఊపందుకుంటాయి. బీట్‌రూట్‌ను జ్యూస్, సలాడ్ గా తినవచ్చు.. అలాగే.. కూర, హల్వా కూడా చేసుకుని తినవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొండలా ఉన్న పొట్ట సులువుగా కరిగిపోవాలంటే..

పాకిస్థాన్‌లో సూపర్‌ రిచ్ ఈ హిందూ మహిళ

ఛీ.. ఎంతకు తెగిస్తున్నార్రా.. అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ ఫేక్ వీడియో

షమీకి మళ్లీ జట్టులోకి ఛాన్స్ !! గౌతమ్ గంభీర్ కు షాక్

వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌