AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: కరోనా కొత్త వేరియంట్‌ను తరిమికొట్టాలంటే, రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోండి..

ప్రపంచవ్యాప్తంగా జేఎన్‌1 వేరియంట్‌ కొత్తేడాది భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. కేరళలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేలకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్‌ బారిన పడకుండా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు...

Health: కరోనా కొత్త వేరియంట్‌ను తరిమికొట్టాలంటే, రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోండి..
Covid 19 Jn1
Narender Vaitla
|

Updated on: Dec 25, 2023 | 6:59 PM

Share

కోవిడ్‌ 19 సబ్‌ వేరియంట్‌ జేఎన్‌ 1 ప్రస్తుతం భయాందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకీ యాక్టివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జేఎన్‌1 వేరియంట్‌ కొత్తేడాది భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. కేరళలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేలకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్‌ బారిన పడకుండా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి రోగ నిరోధక శక్తిని సహజంగా ఎలా పెంచుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..

* తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. బీటా కెరోటిన్‌, విటమిన్‌ సి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. నారింజ, నిమ్మ జాతికి చెందిన పండ్లను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజులో కనీసం గంటసేపు ఏదైనా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వ్యాయామం చేయకపోయినా వీలైనంత ఎక్కువగా నడవడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద శారీరక శ్రమను పెంచాలని చెబుతున్నారు.

* వైరస్‌ దరిచేరకుండా ఉండాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా శరీరం హైడ్రేట్‌గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగినంత నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉంటే శరీరం నుంచి ప్రమాదకరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు.

* రోగ నిరోధక శక్తి పెరగడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. సరిపడ నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యకరమైన పెద్దలు రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని అంటున్నారు. నిద్రలేమితో ఇబ్బందిపడే వారి రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

* ఇక మానసిక ఆరోగ్యాన్నికూడా కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు మెడిటేషన్‌, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అబ్బాయిల గురించి చాలా మంది తల్లిదండ్రులకు తెలియని వాస్తవాలు!
అబ్బాయిల గురించి చాలా మంది తల్లిదండ్రులకు తెలియని వాస్తవాలు!
మూడు ముక్కలు కలిపి తాగితే నీళ్ళు కూడా అమృతం అవుతాయ్
మూడు ముక్కలు కలిపి తాగితే నీళ్ళు కూడా అమృతం అవుతాయ్
రూపాయి ఖర్చు లేకుండా గడ్డిలాంటి జుట్టును సాఫ్ట్‌గా మార్చుకోండిలా!
రూపాయి ఖర్చు లేకుండా గడ్డిలాంటి జుట్టును సాఫ్ట్‌గా మార్చుకోండిలా!
వర్షం వస్తే ఇంట్లో నీళ్లు.. తినడానికి తిండి లేదు..
వర్షం వస్తే ఇంట్లో నీళ్లు.. తినడానికి తిండి లేదు..
క్రికెట్ నుంచి అథ్లెటిక్స్‌కు.. లంక బౌలర్ గోల్డెన్ స్టోరీ ఇదే
క్రికెట్ నుంచి అథ్లెటిక్స్‌కు.. లంక బౌలర్ గోల్డెన్ స్టోరీ ఇదే
పెరుగుతున్న ఫ్యాటీ లివర్ కేసులు.. కారణం ఇదే అంటున్న నిపుణులు
పెరుగుతున్న ఫ్యాటీ లివర్ కేసులు.. కారణం ఇదే అంటున్న నిపుణులు
ఇలా దాస్తే మల్లెపూలు వారమైనా నల్లబడవు..
ఇలా దాస్తే మల్లెపూలు వారమైనా నల్లబడవు..
వందే భారత్ లోక్ పైలట్ జీతం ఎంతో తెలుసా..?
వందే భారత్ లోక్ పైలట్ జీతం ఎంతో తెలుసా..?
కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్‌.. పోలీస్ ఉద్యోగాలపై కీలక ప్రకటన
కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్‌.. పోలీస్ ఉద్యోగాలపై కీలక ప్రకటన
హార్దిక్ కోసం ఇద్దరు స్టార్ ప్లేయర్లను బలి ఇవ్వనున్న సీఎస్కే?
హార్దిక్ కోసం ఇద్దరు స్టార్ ప్లేయర్లను బలి ఇవ్వనున్న సీఎస్కే?