Vakkaya Benefits: విటమిన్ ‘సి’ అధికంగా ఉండే వాక్కాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

Carissa Carandas: వాక్కాయ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో దొరికే ఒక పండు.ఇవి చూడడానికి ద్రాక్షపళ్లకంటే చిన్నవిగా ఉండే ఈ పళ్ళను కూరలలో పులుపుకు, పచ్చళ్ళకు ఉపయోగిస్తారు..

Vakkaya Benefits: విటమిన్ 'సి' అధికంగా ఉండే వాక్కాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
Vakkaya
Follow us
Surya Kala

|

Updated on: Jun 24, 2021 | 3:05 PM

Carissa Carandas: వాక్కాయ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో దొరికే ఒక పండు.ఇవి చూడడానికి ద్రాక్షపళ్లకంటే చిన్నవిగా ఉండే ఈ పళ్ళను కూరలలో పులుపుకు, పచ్చళ్ళకు ఉపయోగిస్తారు. వాక్కాయ తో పులిహోర, మాంసం వాక్కాయ, వాక్కాయ పచ్చడి వంటి అనేక రకాల వంటలను తయారు చేస్తారు. అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ మొక్కలనుండి పండ్లు వానకాలంలో కొన్నిరోజులు మాత్రమే లభిస్తాయి. వీటిని సాధారణంగా భారతీయ ఊరగాయలు, సుగంధ ద్రవ్యాలలో ఒక రుచికోసం కలిపే పదార్థంగా ఉపయోగిస్తున్నారు. వాక్కాయలను కాన్ బెర్రీస్ అని కూడా అంటారు. వీటిలో మధుమేహాన్ని నివారించే ఎన్నో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని జర్మనీ లోని డ్యుసెల్ డోర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్త అనా రోడ్రిగ్స్ తెలిపారు. ఈ వాక్కాయ వగరుగా పుల్లగా ఉంటుంది. భారత క్రాన్ బెర్రీస్ గా పిలవబడుతూ మూత్రపిండాలలో రాళ్ళని కరిగించే విగా మూత్ర నాళాలని శుభ్రపరిచేవిగా ప్రసిధ్ధి చెందినవి. విటమిన్ సి అధికంగా ఉన్న ఈ వాక్కాయ అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, మరియు యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఉబ్బసం చికిత్స నుండి చర్మ వ్యాధుల వరకు, వాక్కాయలు శరీరానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ వాక్కాయ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

*వగరుపులుపు కలిసిన ఈ వాక్కాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఉదర సమస్యలను నివారించడానికి ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తొలగించడానికి సహాయపడుతుంది. ఎండిన పండ్ల పొడిని నీటితో కలిపి తీసుకుంటే.. కడుపుని తేలికపరుస్తుంది మరియు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, దీంతో ఆకలిని పుట్టేలా చేస్తుంది.

*వాక్కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దీంతో పూర్వకాలంలో జ్వరం వస్తే చికిత్స కోసం ఉపయోగించేవారు. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల, పోషకాలు అంటువ్యాధులతో పోరాడటం ద్వారా జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

*సీజన్ లో దొరికే ఈ వాక్కాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మురుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్లు మరియు ట్రిప్టోఫాన్లతో పాటు మెగ్నీషియం ఉండటం సిరోటోనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.

*వాక్కాయ జ్యూస్ తాగడం వలన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె కండరాలను బలోపేతం చేయడానికి రోజూ 15 నుండి 20 మి.లీ వాక్కాయ రసం తీసుకోవచ్చు.

*శరీరం డీహైడ్రేషన్ బారిన పడితే.. తక్షణ శక్తిని ఇస్తుంది. అంతేకాదు శరీరంలోని మంటను తగ్గిస్తుంది.

*వాక్కాయ శరీరంలోని పిత్తాశయం, చిగుళ్ళలో రక్తస్రావం మరియు అంతర్గత రక్తస్రావం వంటి ఎన్నో సమస్యలను నివారిస్తుంది.

*ప్రతిరోజూ వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.

* దంతాలు పుచ్చిపోకుండా చేయడమే కాదు నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది.

*మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడటంలో అత్యంత ప్రయోజనకారి వాక్కాయ

Also Read: యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా.. తెల్ల గలిజేరు పచ్చడి బెస్ట్ మెడిసిన్.. తయారీ విధానం ఎలా అంటే