Tella Galijeru Pachadi : యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా.. తెల్ల గలిజేరు పచ్చడి బెస్ట్ మెడిసిన్.. తయారీ విధానం ఎలా అంటే
Tella Galijeru Pachadi : మనకంటే ముందుతరాల వారు 80 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవారు.. ఎవరి పనులు వారు చేసుకుంటూ.. చలాకీగా తిరిగేవారు.. దీనికి ముఖ్య కారణం ఆరోగ్యకరమైన తిండి...
Tella Galijeru Pachadi : మనకంటే ముందుతరాల వారు 80 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవారు.. ఎవరి పనులు వారు చేసుకుంటూ.. చలాకీగా తిరిగేవారు.. దీనికి ముఖ్య కారణం ఆరోగ్యకరమైన తిండి.. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం.. అప్పటి వారు పొలం గట్టున దొరికే ఆకుకూరలను తినేవారు. పప్పు, పచ్చడి, కూర ఇలా రుచికరంగా చేసుకుని ఆర్యోగంగా ఉండేవారు. ఈరోజు పొలం గట్లమీద కనిపించే తెల్లగలిజేరు పచ్చడి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
తెల్ల గలిజేరు పచ్చడికి కావాల్సిన పదార్ధాలు:
గలిజేరు ఆకులు- మూడు కప్పులు వేరుశనగ గుళ్ళు – పావుకప్పు ఎండుమిర్చి- మూడు పచ్చిమిర్చి- రెండు జీలకర్ర- చెంచా ధనియాలు- రెండు చెంచాలు మిరియాలు- పావుచెంచా చింతపండు- నిమ్మకాయంత ఇంగువ- చిటికెడు వెల్లుల్లిరెబ్బలు- ఆరు ఉప్పు- రుచికి తగినంత నూనె- తగినంత
పోపుదినుసులు:
ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వెల్లుల్లి
తయారుచేయువిధానం :
ముందుగా గలిజేరు ఆకులని శుభ్రం చేసి కడిగి, తడిలేకుండా ఆరాబెట్టాలి. తర్వాత గ్యాస్ స్టౌ మీద బాండీ పెట్టి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, మిరియాలు..ఒకొక్కటి విడివిడిగా దోరగా వేయించుకోవాలి. వీటన్నింటిని చల్లార్చుకుని మిక్సీలో బరకగా పొడిచేసుకుని అందులోనే గలిజేరు ఆకులు, చింతపండు వేసి మిక్సీ పట్టాలి. అవసరాన్ని బట్టి కొంచెం నీరు పోసి పచ్చడిని మిక్సీ పెట్టుకోవచ్చు. తర్వాత ఈ తెల్ల గలిజేరు పచ్చడికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వెల్లుల్లి , ఇంగువ వేసి తాలింపు వేసుకోవాలి. అంతే ఆరోగ్యాన్ని ఇచ్చే రుచికరమైన తెల్ల గలిజేరు పచ్చడి సిద్ధం. ఇది నాలుగురోజులు నిల్వ ఉంటుంది. అన్నంలోకి ఇడ్లి, దోశల్లోకి బాగుంటుంది.
తెల్ల గలిజేరు ప్రయోజనాలు:
తెల్ల గలిజేరునే పునర్నవ, అటికమామిడి, పప్పాకు అని కూడా అంటారు. ఇంటి వైద్యానికి పెట్టింది పేరు. శరీరంలో అధికంగా నీరు పట్టినప్పుడు ఆ నీటిని తగ్గించే గుణం దీనికి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్ సి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం ఇది. కనుక వీలున్నప్పుడు ఈ పచ్చడిని చేసుకుని తినడం ఆరోగ్యానికి సహజమైన మెడిసిన్ గా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read: నాపగ పాము పగ ఒకటేనంటున్న మోనిత.. దీప కోసం పోరాడినట్లే తనకోసం పోరాడామని సౌందర్యకు రిక్వెస్ట్