Karthika Deepam: నా పగ పాము పగ ఒకటేనంటున్న మోనిత.. దీప కోసం పోరాడినట్లే తనకోసం పోరాడామని సౌందర్యకు రిక్వెస్ట్

Karthika Deepam: ఓ వైపు మోనిత ఎం చేసింది అని దీప ఆలోచిస్తుండగా.. మరోవైపు మోనిత కార్తీక్ ని పెళ్లి చేసుకోవడానికి సన్నాహాల్లో ఉంది.. మోనిత మెట్లు దిగుతూ.. కార్తీక్ ఇచ్చిన గడువుని గుర్తు చేసుకుంటూ...

Karthika Deepam: నా పగ పాము పగ ఒకటేనంటున్న మోనిత.. దీప కోసం పోరాడినట్లే తనకోసం పోరాడామని సౌందర్యకు రిక్వెస్ట్
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Jun 24, 2021 | 4:33 PM

Karthika Deepam: ఆసక్తికరంగా సాగుతూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ ఈ రోజు 1074 వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ ను చూద్దాం.. ఓ వైపు మోనిత ఎం చేసింది అని దీప ఆలోచిస్తుండగా.. మరోవైపు మోనిత కార్తీక్ ని పెళ్లి చేసుకోవడానికి సన్నాహాల్లో ఉంది.. మోనిత మెట్లు దిగుతూ.. కార్తీక్ ఇచ్చిన గడువుని గుర్తు చేసుకుంటూ..ఇంక మూడు రోజులే టైం ఉంది. నన్ను తిట్టి, కొట్టిన దీప, సౌందర్యలు కుళ్ళికుళ్ళి ఏడుస్తారు.. నీకు దీప కావాలా నాయన ఉండగా నీకు దీప ఎలా దక్కుతుంది అని అనుకుంటూ.. ప్రియమణిని పిలిచి వేడినీరు తెమ్మని చెబుతుంది. కాఫీ తెస్తా అన్న ప్రియమణితో.. నాకు అదే నచ్చదు.. నేను ఏది అంటే అదే చెయ్యాలి.. అందుకే దీప గతి ఏమైందో చూశావా.. నా పగ పాము పగ ఒకటే.. కాకపోతే ఒకటే తేడా.. పాము చెప్పకుండా కాటేస్తుంది. నేను చెప్పి కాటేస్తాను మిగతావన్నీ సేమ్ టూ సేమ్ అంటూ.. ప్రియమణికి వార్నింగ్ ఇస్తుంది మోనిత.

మురళీ కృష్ణ ఇంట్లో భాగ్యం దీపని పిల్లల్ని ఇక్కడికి తీసుకుని రావడానికి వెళ్తాను అని చెబుతుంది. మరోవైపు కార్తీక్ దీర్ఘంగా ఆలోచిస్తుంటే.. మోనిత ఫోన్ చేస్తుంది. ఫోన్ కట్ చేసిన కార్తీక్.. ఇన్ని సార్లు చేస్తుంది ఏమిటి.. ఇప్పుడు నేను లిఫ్ట్ చేయకపోయినా ఆడో కారణంగా చూపించి నానా రచ్చ చేస్తుంది. ఎందుకు నాకు ఈ శిక్ష అనుకుంటుంటే.. శౌర్య వచ్చి నాన్న నాన్న అని పిలుస్తుంది. కార్తీక్ పలక్కపోవడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

దీప కూడా మోనిత ఎంత జాన తనం చూపించినా డాక్టర్ బాబు చెలించడని నమ్మాను తప్పటడుగు ఎలా పడింది.. ఎం జరిగింది.. మోనిత తో కూడా ముభావంగానే ఉంటున్నారు.. మోనిత ఏమైనా మాయ చేసి ఉంటుందా అని అస్లు ఎం జరిగిందో ఎలా తెలుస్తుంది. ప్రియమణిని అడిగితె తెలుస్తుందా.. చెప్పాడు అని ఆలోచిస్తుంటే.. హిమ వచ్చి అమ్మా అమ్మా అని పిలుస్తుంది. దీప పలకపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఫోన్ కట్ చేయడంతో.. అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు కార్తీక్.. మొత్తానికి నన్ను దూరం పెట్టాలని అనుకుంటున్నాడా.. నేను ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోవడం లేదు.. చెబుతా బుర్రతిరిగే లా చేస్తా.. అప్పుడు నా చుట్టూ తిరుగుతాడు అనుకుంటూ.. క్యాలెండర్ లోని 25 వ తేదీకి రెడ్ ఇంకు తో సున్నా చుడుతుంది. ప్రియమణి ఏమిటని అడిగితె.. ఆ రోజు నేను క్రియేట్ చేయబోయే సునామీ .. అప్పుడు మీ కార్తీకయ్య నా కాళ్ళ దగ్గరకు రాక తప్పదు.. నా మేడలో తాళి కట్టక తప్పదు అని ప్రియమణితో చెబుతుంది మోనిత

సౌందర్య తీవ్రంగా ఆలోచిస్తుంటే.. మోనిత ఇంట్లో అడుగు పెడుతుంది. నమస్తే ఆంటీ అంటూ.. నేను ఏమి తప్పు చేశాను.. మీ అబ్బాయి తప్పు చేశాడు.. నేను దీపని పెళ్లి చేసుకోక ముందు నుంచి కార్తీక్ ని ప్రేమిస్తున్నా అయినా మీకు నా ప్రేమ అర్ధం కావడం లేదు అంటుంది. మీ అబ్బాయికి కూడా నేను అంటే ఇష్టం ఉంది. అనుకునే మా ఇంటికి వచ్చ్చేవాడు.. ఇన్నాళ్ళకు నన్ను అర్ధం చేసుకున్నాడు నా బతుకు పండింది. ఇప్పుడేమో మొహం చాటేస్తున్నాడు.. అతి స్త్రీగా దీప కోసం పోరాడినట్లు ఇక నుంచి నా కోసం మీరే పోరాడాలి అంటుంది..

సౌందర్య నవ్వుతూ మోనిత ని కూర్చోమని.. నా కొడుకు నాతొ ఒక మాట చెప్పాడు అంటుంటే.. మోనిత కంగారు పడుతూ.. కార్తీక్ మీతో చెప్పిన ఆ ఒక్క మాట ఏంటీ ఆంటీ?’ అని అడుగుతుంది. అది గమనించిన సౌందర్య.. ‘చెబుతాను.. ఒక్క నిమిషం. అంటూ.. శ్రావ్యని పిలిచి కాఫీ తీసుకుని రమ్మనమని చెబుతుంది. మళ్ళీ వద్దులే కడుపుతో ఉంది కదా ఏదైనా జ్యూస్ తీసుకునిరా. అంటే.. శ్రావ్య పుల్లని మామిడికాయ కావాలేమో అడగండి అంటుంది. అంత వికారంగా ఏం కనిపించడటం లేదులే.. జ్యూస్ చాల్లే అంటుంది సౌందర్య. ఇదంతా చూస్తున్న మోనిత ఏమిటి ఈ విడ తొణక్కుండా ఉంది? కార్తీక్ ఏమి చెప్పి ఉంటాడు అంటూ కంగారు పడుతుంది.

దీప ఇంట్లో కార్తీక్ దీప తో మాట్లాడుతూ నిన్ను కూర్చోబెట్టుకోవడానికి ఎంతసేపు బతిమలాడాల్సి వచ్చిందో.. నా పరిస్థితి ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు .. దీప నీ మౌనాన్ని భరించలేకపోతున్నా.. మాట్లాడు తిట్టు.. లేదంటే కొట్టు మాట్లాడు అని బతిమాలుతుంటే.. ఎదో చెబుతా అన్నారుగా చెప్పండి డాక్టర్ బాబు అంటుంది.. మీరు చెప్పింది.. నేను విన్నది అయితే మళ్ళీ చెప్పడం దేనికి అంటూ ముందరకాళ్ళకు బంధం వేస్తుంది దీప.

అవన్నీ పక్కన పెడదాం అంటుంటే.. నన్ను కూడానా అంటుంది. ఇన్నాళ్లు నా మీద నమ్మకంగా ఎలా ఉన్నవో.. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉండు దీప అంటాడు కార్తీక్.. రేపటి ఎపిసోడ్ లో మోనిత కార్తీక్ తో పెళ్లి కి ముహర్తం పెట్టిన విషయం పిల్లలు తెలుస్తోంది.. మరి కార్తీక్ మోనిత ప్లాం నుంచి ఎలా బయటపడతాడు అనేది చూడాలి మరి.

Also Read: : పోస్టాఫీసుల్లో అదిరిపోయే స్కీమ్స్‌ అందుబాటులో.. నెలకు రూ.172 చెల్లిస్తే రూ.3 లక్షలు