Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasar Bharati e-office: ఉద్యోగుల పని మొత్తం ఆన్‌లైన్‌లోనే.. ఈ-ఆఫీస్‌కు మారిపోయిన ప్రసార భారతి

Prasar Bharati goes paperless: సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రసార భారతి తమ పనులను సరికొత్త రీతిలోకి మార్చుకుంది.  రెండు సంవత్సరాలలో సంస్థ సరికొత్త రూపును సంతరించుకుంది. దేశంలోని....

Prasar Bharati e-office: ఉద్యోగుల పని మొత్తం ఆన్‌లైన్‌లోనే..  ఈ-ఆఫీస్‌కు మారిపోయిన ప్రసార భారతి
Prasar Bharati E Office
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 24, 2021 | 10:16 PM

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తితో అంతా ఆన్‌లైన్‌లోకి మారిపోయింది. ఇంట్లోని చిన్నారు, అమ్మ, నాన్న ఇద్దరి ఉద్యోగాలు ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌కి మారిపోయాయి. చిన్న సంస్థల నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అంతా ఫర్క్ ఫ్రం హోంకు చేరిపోయాయి. ఇప్పుడు భారత దేశంలోని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇదే పనిలోకి దిగిపోాయయి. ఇలా ప్రసార భారతి కూడా ఇదే దారిలో ప్రయాణిస్తోంది. అందులో పని చేస్తున్న ఉద్యోగుల కార్యకలాపాలను ఆన్‌లైన్‌లోకి మార్చేసింది.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రసార భారతి తమ పనులను సరికొత్త రీతిలోకి మార్చుకుంది.  రెండు సంవత్సరాలలో సంస్థ సరికొత్త రూపును సంతరించుకుంది. దేశంలోని 577 దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలలో పనిచేస్తున్న దాదాపు 22,348 మంది సిబ్బందిని ఈ-ఆఫీస్ ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుని అమలు చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, ఆ తరువాత నెలకొన్న పరిస్థితి వల్ల సిబ్బంది వివిధ పరిమితులకు లోబడి పనిచేయవలసి వచ్చింది. ఈ సమయంలో ఐటీ ఆధారిత ఈ-ఆఫీస్ వ్యవస్థ వారికి అనేక విధాలుగా ఉపయోగపడింది.

కాగితాలతో పని లేకుండా మరింత సమర్ధవంతంగా అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రసార భారతిలో 2019 ఆగస్టులో ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో ఉన్న 577 ప్రసార భారతి కేంద్రాలలో 10శాతం కేంద్రాలు 2019 ఆగస్ట్-డిసెంబర్ మధ్యలో ప్రవేశ పెట్టింది. ఈ-ఆఫీస్ అమలులోకి తీసుకొచ్చింది.

2020లో 74శాతం కేంద్రాల్లో ఈ విధానం అమలులోకి రాగా మిగిలిన 16శాతం కేంద్రాల్లో ఈ-ఆఫీస్ ను అమలులోకి తీసుకొచ్చింది. అత్యంత వేగంగా సమర్ధంగా సిబ్బంది ఈ-ఆఫీస్ వినియోగానికి అలవాటు పడడంతో ప్రసార భారతిలో 50వేల ఈ-ఫైల్స్ రూపుదిద్దుకున్నాయి. ఇవన్నీ ఆన్ లైన్ లో అందుబాటులో వచ్చాయి. అంతర్గతంగా సంబంధిత విభాగాలు ఈ ఫైళ్ల పరిస్థితిని తెలుసుకోగలుగుతొంది.

ఒక ఫైల్ పై తగిన చర్యను తీసుకోవడానికి బౌతికంగా పనిచేసినప్పుడు కనీసం వారం రోజులు పట్టేది. ఈ-ఆఫీస్ అమలులోకి రావడంతో ఈ సమయం సరాసరిన 24 గంటలకు తగ్గింది. ఒకోసారి కొన్ని గంటల వ్యవధిలో కూడా పని పూర్తవుతున్నది.

ఈ-ఆఫీస్ వ్యవస్థ ప్రయోజనాలు ప్రసార భారతిలో కనిపిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల కాలంలో ప్రసార భారతి అనేక ఫైళ్లపై తుది నిర్ణయాన్ని తీసుకుని పరిష్కరించింది. నెలవారీగా పరిష్కరిస్తున్న ఫైళ్ల సంఖ్యా కూడా గణనీయంగా పెరిగింది.

ఇవి కూడా చదవండి : రాత్రిళ్లు కల్లోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు..! బిహార్‌ పోలీసుల ముందుకు విచిత్రమైన కేసు..!

సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ..