AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trouble with Egg: ఒకే ఒక్క గుడ్డు.. ఒకరిని ఆసుపత్రికి.. మరొకర్ని పోలీస్ స్టేషన్ కి చేర్చింది.. ఎలాగంటే..

Trouble with Egg: ఒక్కోసారి టైం ఎంత చెత్తగా ఉంటుందంటే చెప్పలేం. చిన్న కారణం.. తెచ్చే చిక్కులు తరువాత తీరుబడిగా ఆలోచిస్తే తేలుతాయి తప్పులు.

Trouble with Egg: ఒకే ఒక్క గుడ్డు.. ఒకరిని ఆసుపత్రికి.. మరొకర్ని పోలీస్ స్టేషన్ కి చేర్చింది.. ఎలాగంటే..
Trouble With Egg
KVD Varma
|

Updated on: Jun 24, 2021 | 10:13 PM

Share

Trouble with Egg: ఒక్కోసారి టైం ఎంత చెత్తగా ఉంటుందంటే చెప్పలేం. చిన్న కారణం.. తెచ్చే చిక్కులు తరువాత తీరుబడిగా ఆలోచిస్తే తేలుతాయి తప్పులు. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే.. చిన్న విషయాన్ని ఒక్కోసారి చాలా ప్రేస్టేజియస్ గా తీసుకుంటారు. వారి అహం దెబ్బ తిన్నట్టుగా భావించి విపరీతమైన హంగామా చేసేస్తారు. దీంతో వారు ఎదుటివారితో చాలా చికాకుగా ప్రవర్తించడమే కాకుండా వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసి.. తామూ చిక్కుల్లో పడతారు. అటువంటిదే ఈ సంఘటన కూడా. ఒక్క కోడిగుడ్డు ఒక వ్యక్తిని గాయాల పాలు చేసింది. మరోవ్యక్తిని పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పింది. బెంగళూరు లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఒక యువకుడు చికెన్ కొనడానికి వెళ్ళాడు. చికెన్ కొడుతున్న సమయంలో అక్కడ ఒక గుడ్డు తీసుకుని సంచిలో వేశాడు. అది చూసిన దుకాణం యజమాని ఆ యువకుడిని కోపంతో బాదాడు. దీంతో ఆ యువకుడు గాయపడ్డాడు. విషయం పోలీసుల వద్దకు చేరింది. బెంగళూరు బేగూర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల గోపి ఆర్ ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. ఇతను వైట్ఫీల్డ్ సమీపంలోని చిక్కా బేగూర్ నివాసి. ఆదివారం మధ్యాహ్నం అక్కడికి దగ్గరలోని శాంత కుమార్ అనే వ్యక్తి నడుపుతున్న చికెన్ సెంటర్ కు చికెన్ కోసం వెళ్ళాడు. రెండు కేజీల చికెన్ ఆర్డర్ చేశాడు. చికెన్ సిద్ధం అవుతున్న సమయంలో గోపీ అక్కడ ఉన్న ఒక క్రేట్ నుంచి ఒక గుడ్డును తీసుకున్నాడు. అయితే, ఇది శాంతకుమార్ కు చెప్పకుండా చేశాడు.

దీంతో శాంతకుమార్ గుడ్డు ఎందుకు తీశావంటూ గోపీ తో వాగ్వాదం పెట్టుకున్నాడు. నేను చికెన్ డబ్బులు ఇచ్చేటప్పుడు గుడ్డు డబ్బులు కూడా ఇస్తాను అని గోపీ చెప్పాడు. అయితే, శాంత కుమార్ వినిపించుకోకుండా గోపీని దొంగ అంటూ మాట్లాడాడు. దాంతో ఇద్దరి మధ్యా వాదోపవాదనలు గట్టిగా జరిగాయి. ఈ క్రమంలో శాంతకుమార్ కోపం పట్టలేక.. ఇనుప కడ్డీతో గోపీ పై దాడి చేశాడు. దీంతో గోపీ గాయాల పాలయ్యాడు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బెగూర్ పోలీసులు దుకాణ యజమాని శాంత కుమార్ పై క్రిమినల్, బెదిరింపు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో భారీ స్మ‌గ్లింగ్‌.. రూ. కోటిన్న‌ర విలువైన ఐఫోన్‌లు..

యూపీలో దారుణం…జామకాయలు కోసినందుకు ఇద్దరు దళిత పిల్లలను చెట్టుకు కట్టేసి కొట్టిన కసాయి