Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో భారీ స్మ‌గ్లింగ్‌.. రూ. కోటిన్న‌ర విలువైన ఐఫోన్‌లు..

Shamshabad Airport: అక్ర‌మ ర‌వాణాకు శంషాబాద్ ఎయిర్ పోర్టు అడ్డ‌గా మారుతోంది. ప్ర‌తి రోజూ అక్ర‌మంగా ర‌వాణా చేస్తోన్న బంగారం, మాద‌క ద్ర‌వ్యాల‌కు సంబంధించిన‌ వార్తలు క‌నిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గురువారం...

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో భారీ స్మ‌గ్లింగ్‌.. రూ. కోటిన్న‌ర విలువైన ఐఫోన్‌లు..
Shamshabad Airport
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 24, 2021 | 9:53 PM

Shamshabad Airport: అక్ర‌మ ర‌వాణాకు శంషాబాద్ ఎయిర్ పోర్టు అడ్డ‌గా మారుతోంది. ప్ర‌తి రోజూ అక్ర‌మంగా ర‌వాణా చేస్తోన్న బంగారం, మాద‌క ద్ర‌వ్యాల‌కు సంబంధించిన‌ వార్తలు క‌నిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గురువారం మ‌రో అక్ర‌మ ర‌వాణా బ‌య‌ట‌పడింది. శంషాబాద్ విమానాశ్ర‌యంలో త‌నిఖీలు చేప‌ట్టిన క‌స్ట‌మ్స్‌ అధికారులు భారీగా ఐఫోన్ల‌ను సీజ్ చేశారు.

Iphones

Iphones

షార్జా నుంచి వ‌చ్చి ఇద్ద‌రు ప్ర‌యాణికులు 80 ఐ ఫోన్ల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నార‌న్న స‌మాచారం అందుకున్న అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ప‌ట్టుబ‌డ్డ ఇద్ద‌రిని పోలీసులు విచారించారు. ప‌ట్టుబ‌డ్డ ఐఫోన్‌ల‌ను సీజ్ చేసిన పోలీసులు ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కాట‌న్ల‌లో భారీగా త‌ర‌లిస్తున్న ఫోన్ల‌ను చూసిన అధికారులు షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా మూడు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. టాంజానియా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్ ను పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. టాంజానియా దేశస్తుడు జాన్ విలియమ్స్ నుంచి దాదాపు 20 కోట్ల విలువ చేసే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు

Also Read: Maoist Leaders: కారడవుల్లో కరోనా భయం.. తుపాకీ తూటాలను తప్పించుకున్నా… కరోనా రక్కసి మింగేస్తోంది..

Fake vaccination: ముంబైలో భారీగా ఫేక్ వ్యాక్సినేషన్లు… బూటకపు క్యాంపుల్లో రెండు వేలమందికి పైగా టీకా మందు !

Molestation me in Dreams: రాత్రిళ్లు కల్లోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు..! బిహార్‌ పోలీసుల ముందుకు విచిత్రమైన కేసు..!