Maoist Leaders: కారడవుల్లో కరోనా భయం.. తుపాకీ తూటాలను తప్పించుకున్నా… కరోనా రక్కసి మింగేస్తోంది..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హరిభూషణ్‌ మృతి చెందినట్లు గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన మృతిపై మావోయిస్టు పార్టీ అధికారికంగా ఈ ప్రకటన చేసింది.

Maoist Leaders: కారడవుల్లో కరోనా భయం.. తుపాకీ తూటాలను తప్పించుకున్నా... కరోనా రక్కసి మింగేస్తోంది..
Maoist Covid
Follow us

|

Updated on: Jun 24, 2021 | 7:38 PM

జనారణ్యం… అభయారణ్యం.. అన్ని చోట్ల తన విశపు కాటును వేస్తోంది పాపిస్టి కరోనా. అడవుల్లో ఉండే మావోయిస్టులను సైతం కరోనా రక్కసి వీడటం లేదు. కరోనా వైరస్‌తో ఆ పార్టీ అగ్ర స్థాయి నేతలు, క్యాడర్‌ కుప్పకూలి పోతున్నారు. కారడవుల్లో తిరిగే మావోయిస్టులను కరోనా రక్కసి ఎలా చేరిందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో కోవిడ్ సోకినట్లుగా తెలుస్తోంది. కేవలం గత 15 రోజుల్లోనే ముగ్గురు మావోయిస్టలను కరోనా మింగేసింది. ఇప్పుడు కరోనా పేరు చెబితేనే అడివి వణికిపోతోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేవారిని కూడా అడవుల్లోని గ్రామాలకు రానివ్వడం లేదు. ఇక వారు సంచరించే ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కోవిడ్ కట్టుబాట్లను తీసుకుంటున్నారు.

ఫస్ట్ వేవ్‌లో కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ కోవిడ్.. సెకెండ్ వేవ్‌ పల్లె.. పట్టణం అనే తేడాల లేకుండా దాడి చేసింది. వేలాధి మందిని పొట్టన పొట్టన పెట్టుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలకుండా పీడించింది. ఇప్పుడు మన్యంలోని మావోలను వెంటాడుతోంది. మావోయిస్టులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్ కు తోడు కరోనా కాటు తీవ్ర ప్రభావం చూపించింది.

Maoist

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా దక్షిణి బస్తర్‌ అడవుల్లో ఇప్పటికే కరోనాతో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ పోలీసులు అంటున్నారు. మరో 100 మంది వరకు కరోనా బారిన పడినట్లు అక్కడి అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పోలీసులు అనుమానించినట్లుగానే మన్యంలో చనిపోతున్నవారి వివరాలను మావోయిస్టు పార్టీ ప్రకటిస్తోంది.

అయితే కరోనా సోకిన వాళ్లలో మహిళా మావోయిస్టు నేత సుజాతతో పాటు జయలాల్‌, దినేష్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. మైదానం ప్రాంతాలకు వచ్చిన మావోయిస్టు నేతలతో దళాల్లో కరోనా సోకినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో కరోనా వైరస్‌ మావోయిస్టులకు దడ పుట్టిస్తోంది. కాగా, కరోనా సోకిన వారిలో మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు నేతలు ఉన్నట్లు సమాచారం.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హరిభూషణ్‌ మృతి చెందినట్లు గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన మృతిపై మావోయిస్టు పార్టీ అధికారికంగా ఈ ప్రకటన చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోష‌ల్ మీడియాలో లేఖ విడుద‌లైంది.

Maoist Party Letter To Maoi

Maoist Party Letter To Maoi

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హరిభూషణ్‌, దండకారణ్యం మాడ్‌ డివిజన్‌, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్ధబోయిన సారక్క ఆలియాస్‌ భారతక్కలు కరోనాతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ ఓ ప్రతికా ప్రకటనను విడదల చేశారు. “చాలా కాలంగా బ్రాంకైటీస్‌, ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్న యాప నారాయణ ఆలియాస్‌ హరిభూషన్‌ జూన్‌ 21న ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచారు. మరుసటి రోజు ఉదయం 9:50 గంటలకు సిద్ధబోయిన సారక్క కూడా కోవిడ్  లక్షణాలతో మరణించారు. జూన్‌ 22న వారిద్దరి పేరిట సంస్మరణ సభ జరిగింది. మృతుల కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున సంతాపం తెలుపుతున్నాం.” అంటూ ఓ లేఖను విడుదల చేశారు.

అయితే ఈ హరిభూషన్ మృతి చెందినట్లుగా ఇప్పటికే బస్తర్ పోలీసులు ప్రకటించారు. హరిభూషణ్ బస్తర్ అడవుల్లో ‘మీనాగట్ట’ అటవీ ప్రాంతంలో చనిపోయాడని, దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించినట్టు జూన్ 21న ఛత్తీస్‌గఢ్ మీడియాలో వార్తలు ప్రసారం చేసింది. అదే రోజు కొత్తగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ మావోయిస్టు హరిభూషణ్ మరణం గురించి మీడియాకు తెలిపారు. మావోయిస్టులలో చాలామంది అగ్రనాయకులు సైతం కోవిడ్ బారిన పడ్డారని, హరిభూషణ్ మరణంతో ఆ విషయం తమకు ఉన్న సమాచారం నిజమే అని వారు తెలిపారు.

అయితే మావోయిస్ట్ విధివిధానాలను ఖరారు చేసే కేంద్ర కమిటీ సభ్యుడైన హరిభూషణ్‌పై రూ.40లక్షల రివార్డ్ ఉంది. వివిధ రాష్ట్రాల పోలీసులకు, యాంటీ నక్సల్ బలగాల  మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో హరిభూషణ్‌ ఉన్నాడు.

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామానికి హరిభూషణ్‌ .. హన్మకొండలో డిగ్రీ చదువుతూ 1991లో ఆర్‌ఎస్‌యూ (RSU) ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. 2018లో కేంద్ర కమిటీలో స్థానం పొందారు. 33 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేసిన హరిభూషణ్‌ ఎన్నో సార్లు చావు అంచులకు తప్పించుకున్నాడు. తుపాకి తూటాలను రెప్పపాటులో తప్పించుకున్నాడు. కానీ చివరికి కనిపించని కరోనాకు బలయ్యాడు.

గడ్డం మధుకర్‌ చికిత్స పొందుతూ…

హరిభూషణ్‌ కంటే ముందు కరోనా బారినపడిన మావోయిస్టు గడ్డం మధుకర్‌ చికిత్స పొందుతూ June 6, 2021 ఉదయం మృతి చెందాడు. కరోనా బారినపడిన ఆయన చికిత్స కోసం ఈ నెల 2న వరంగల్‌కు వచ్చి అక్కడి పోలీసులకు చిక్కాడు. దీంతో ఆయనను పోలీసులు హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానలో చేర్చి చికిత్స అందించారు.

ఈ క్రమంలో ఉదయం గుండెపోటుకు గురై మధుకర్‌ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. గడ్డం మధుకర్ 22 ఏళ్ల క్రితం పీపుల్స్‌వార్‌లో చేరారు. దండకారణ్య స్పెషల్‌ జోన్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా ఆయన వ్యవహరిచాడు. మధుకర్‌ స్వస్థలం కొముర భీం ఆసిఫాబాద్‌ జిల్లా కొండపల్లి గ్రామం.

Madhukar

ఇవి కూడా చదవండి : రాత్రిళ్లు కల్లోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు..! బిహార్‌ పోలీసుల ముందుకు విచిత్రమైన కేసు..!

సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ..