Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Goes Viral: సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ.. ఆ వెంటనే అతను ఏం చేశాడో తెలుసా…

Slapping and Kicking: ప్రజలు గుమిగూడడాన్ని సీఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కులు ఎస్పీ, సీఎం భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అదనపు ఎస్పీ బ్రిజేష్ సూద్‌ను, కులు ఎస్పీ గౌరవ్ సింగ్ చెంప​ దెబ్బ కొట్టాడు.

Video Goes Viral: సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ.. ఆ వెంటనే అతను ఏం చేశాడో తెలుసా...
Kullu's Sp Slapping
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 24, 2021 | 5:09 PM

హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు పోలీసుల మధ్య చిన్న గొడవ పెద్ద రచ్చగా మారింది. భుంటార్ విమానాశ్రయం సమీపంలో కులు జిల్లా పోలీసు సిబ్బంది.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ భద్రతా సిబ్బందికి మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ మాటలు కాస్త పెద్దదై చేయి చేసుకునే వరకూ వెళ్లింది. ఇది రెండు విభాగాల మధ్య కలకలం రేపింది. ఈ ఘటనలో ఇందులో పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ), అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఎఎస్పి) ఉన్నారు.

సోషల్ మీడియాలో వెలువడిన వైరల్‌గా మారిన ఈ వీడియోలో కులు ఎస్పీ గౌరవ్ సింగ్ ఎఎస్పీ బ్రిజేష్ సూద్‌ను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. ఎఎస్పీ బ్రిజేష్ సూద్‌ ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీ విషయంలో మాటా మాట పెరిగింది. దీనిపై ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్‌ఓ)ని స్థానిక ఎస్పీని కొట్టాడు. సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పర్యటన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సిమ్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇందుకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి…

అసలు ఏం జరిగిందంటే.. ఫోర్ లేన్ ప్రభావిట్ కిసాన్ సంఘ్ సభ్యులు విమానాశ్రయం బయట నినాదలు చేస్తున్నారు. అయితే అక్కడ ప్రజలు గుమిగూడడాన్ని సీఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కులు ఎస్పీ, సీఎం భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అదనపు ఎస్పీ బ్రిజేష్ సూద్‌ను, కులు ఎస్పీ గౌరవ్ సింగ్ చెంప​ దెబ్బ కొట్టాడు. వెంటనే సీఎం భద్రతా సిబ్బంది ఎస్పీని అడ్డుకున్నారు. అదే సమయంలో ఎస్పీ గౌరవ్ సింగ్‌ని సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ) బల్వంత్ సింగ్ కాలితో తన్నడం వీడియోలో రికార్డ్ అయ్యింది.

కాగా, ఈ సంఘటనలో పాల్గొన్న ముగ్గురు అధికారులను విచారణ ముగిసే వరకు సెలవుపై పంపినట్లు రాష్ట్ర డీజీపీ సంజయ్ కుండు ప్రకటించారు. ప్రస్తుతం కులు ఎస్పీ బాధ్యతను డీఐజీ (సెంట్రల్ రేంజ్) మధుసూదన్ తీసుకున్నారు. అలాగే బ్రిజేష్ సూద్‌ స్థానంలో పండోహ్ 3వ బెటాలియన్ చెందిన ఏఎస్పీ పునీత్ రఘును నియమించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి : రాత్రిళ్లు కల్లోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు..! బిహార్‌ పోలీసుల ముందుకు విచిత్రమైన కేసు..!