Black Fungus: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. వృద్ధుడు మృతి
Old Man Dies of Black Fungus: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బ్లాక్ ఫంగస్‌తో వృద్ధుడు మరణించాడు. జిల్లాలోని గణపురం మండలం
Old Man Dies of Black Fungus: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బ్లాక్ ఫంగస్‌తో వృద్ధుడు మరణించాడు. జిల్లాలోని గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గుండు పోషయ్య (64) బ్లాక్ ఫంగస్‌తో గురువారం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పోషయ్యకు కంటి నుంచి నీరు కారడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పోషయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యులు అతడిని ఇంటికి తీసుకొని వెళ్లారు. ఈ క్రమంలో అతని పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు.
కాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని సీతారాంపురం గ్రామంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అధికారులు సీతారాంపురం గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా కరోనా కేసులు పెరగకుండా గ్రామంలో శానిటైజేషన్ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పోషయ్య బ్లాక్ ఫంగస్ బారిన పడి మరణించడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
Also Read: