Crime News: ”ఒక్క రూపాయి ఇస్తే రూ.కోటి ఇస్తా”.. ఆన్‌లైన్‌లో మార్కెట్‌లో టీచర్‌కు కుచ్చు టోపీ.!
Bengaluru Crime News: ఎంత ప్రయత్నించినా సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. కొత్త పంధాలను ఎంచుకుంటూ.. ఫ్రీ ఆఫర్స్ ఆశ చూపి..
ఎంత ప్రయత్నించినా సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. కొత్త పంధాలను ఎంచుకుంటూ.. ఫ్రీ ఆఫర్స్ ఆశ చూపి.. అమాయకులను దోచేసుకుంటున్నారు. ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ, ఎవరో ఒకరు ఈ సైబర్ ఉచ్చులో పడిపోతున్నారు. తాజాగా టీచర్ అయిన ఓ మహిళ ఈ కేటుగాళ్ల ఉచ్చులో పడి భారీగా డబ్బును పోగొట్టుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఆన్‌లైన్ యాప్ OLXలో తన వద్ద ఉన్న 1947వ సంవత్సరం రూపాయి కాయిన్‌ను సదరు టీచర్ అమ్మకానికి పెట్టారు. జూన్ 15న పెట్టిన పోస్టులో తన మొబైల్ నెంబర్‌ను సైతం యాడ్ చేశారు. దీన్ని గమనించిన ఓ కేటుగాడు పక్కా ప్లాన్‌తో స్కెచ్ వేసాడు. సదరు టీచర్‌కు ఆ కాయిన్ కొనడానికి నేను రెడీగా ఉన్నానని కోటి రూపాయలు వరకూ ఇవ్వగలనని అన్నాడు. అంతే జాక్‌పాట్ తగిలిందని భావించిన టీచర్.. నమ్మేసింది. అక్కడితో అతని నాటకం మొదలైంది.
డబ్బు పంపించడానికి బ్యాంకు అకౌంట్ వివరాలు అడిగాడు. టీచర్ పూర్తి డీటైల్స్ ఫుల్ క్లారిటీతో అన్ని వివరాలు చెప్పిన తర్వాత ఆమెకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. తాను డబ్బులు పంపానని ఇదే ఆ ట్రాన్సక్షన్ స్క్రీన్ షాట్ అని చెప్పాడు. తనకు డబ్బులు రాలేదని తెలుసుకున్న టీచర్ ప్రశ్నించేందుకు అతనికి తిరిగి ఫోన్ చేసింది. అంత పెద్ద మొత్తం అమౌంట్ ఖాతాలో డిపాజిట్ అవడానికి కొన్ని ట్యాక్స్‌లు లాంటివి కట్టాలని చెప్పాడు. కొంచెం ఖర్చు అవుతుందని అలా చేస్తే డబ్బు జమ అవుతుందని అన్నాడు. ఆర్బీఐ, ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉందని మరోసారి చెప్పాడు. ఇలా టీచర్ ఫోన్ చేసిన ప్రతిసారి నగదు జమ పూర్తి కావడానికి ఏదో ఒక కారణంతో డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. ఆమె ఇస్తూనే ఉంది. ఎన్నిసార్లు మనీ పంపినా ఏదో ఒక కారణం చెప్పడంతో విసిగిపోయిన టీచర్.. కోటి వస్తుందా రాదా అని గట్టిగా నిలదీసింది. దాదాపు లక్షల్లో ట్రాన్సఫర్ చేసిన ఆమెకు రెస్పాన్స్ రావడం ఆగిపోయింది. అప్పటికి తేరుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Also Read:
Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!
Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!
సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!