Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!
సృష్టిలో అమ్మకు మించిన ప్రతిరూపం లేదు. ఆమె ప్రేమ వెలకట్టలేనిది. మనుషులోనైనా, జంతువులోనైనా ఇది ఒకేలా ఉంటుంది. ప్రతీ తల్లి తన బిడ్డలను..
సృష్టిలో అమ్మకు మించిన ప్రతిరూపం లేదు. ఆమె ప్రేమ వెలకట్టలేనిది. మనుషులోనైనా, జంతువులోనైనా ఇది ఒకేలా ఉంటుంది. ప్రతీ తల్లి తన బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. వారికి చిన్న దెబ్బ తగిలినా తల్లి గుండె విలవిల్లాడిపోతుంది. పిల్లలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా.. అమ్మ మనసు సహించదు. తన గురించి పట్టించుకోకుండా.. వాటి నుంచి తన బిడ్డలను బయటపడేసే దాకా పోరాడుతూనే ఉంటుంది. తల్లిప్రేమకు అడ్డం పట్టే విధంగా సోషల్ మీడియాలో తరచూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
చిరుతపులి.. వేగానికి, తెలివికి, చురుకుదనానికి పెట్టింది పేరు. ఎరను వేటాడటంలో చిరుతకు తిరుగులేదని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అలాంటి చిరుతకు ఓ సందిగ్దత పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే.. వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఆడ చిరుతపులి తన పిల్లలతో కలిసి చెట్టు కింద సేద తీరుతుండగా.. అనూహ్యంగా ఓ భారీ ఆఫ్రికన్ పైథాన్ అక్కడికి వస్తుంది. దాన్ని చూసి చిరుత పిల్లలు భయంతో పారిపోతాయి. అయితే తల్లి చిరుత మాత్రం బెదరకుండా.. ఆ పైథాన్‌ను ధీటుగా ఎదుర్కుంటుంది. తన పిల్లలకు ఓ కవచంలా ఉంటూ.. పైథాన్‌ను వారి వైపుకు వెళ్లకుండా చూసుకుంటుంది. పైథాన్‌ను ఉన్న చోటు నుంచి కదలనివ్వకుండా.. దాన్ని భయపెడుతుంది.
కాగా, ఈ వీడియోను ‘Earth Focus’ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. ‘ఓ తల్లి చిరుతపులి తన పిల్లలను ఆఫ్రికన్ రాక్ పైథాన్ నుండి రక్షించడానికి ప్రయత్నిస్తోంది’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు, లైకులతో హోరెత్తిస్తున్నారు. క్షణాల్లో వేలల్లో వ్యూస్ తెచ్చుకుంది.
View this post on Instagram
Also Read:
13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!
పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!